ప్రధాని మోడీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. సుంకాల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. భారత్‌తో వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రత్యేకంగా భేటీ అయి చర్చలు కూడా జరిపారు. అయినా పురోగతి లభించలేదు.
యుద్ధాలపై మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలపై రోజుకో మాట మారుస్తున్నారు. గురువారం టెక్ సీఈవోలతో భేటీ అయినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మూడు యుద్ధాలను ఆపానంటూ చెప్పుకొచ్చారు.
ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని హమాస్‌తో చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ తెలిపారు. శుక్రవారం ఓవర్ కార్యాలయంలో ట్రంప్ మాట్లాడుతూ.. గాజాలో బందీలుగా ఉన్న వారిని విడుదల చేయాలని హమాస్‌తో చాలా లోతైన చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు
సుంకాలు కారణంగా భారత్-అమెరికా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్రస్తుతం సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా అధికారులు మరింత ఆజ్యం పోస్తున్నారు. పుండి మీద కారం చల్లినట్లుగా రెచ్చగొట్టే ప్రేలాపనలు చేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్ గురించి గానీ.. మోడీ గురించి గానీ గంటకో మాట మాట్లాడుతున్నారు. అప్పటికప్పుడే విమర్శిస్తుంటారు.. అంతలోనే మాట మారుస్తూ ఉంటారు. భారత్.. అమెరికాకు దూరం అయిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతలోనే మీడియా సమావేశంలో అదేమీ లేదు.. మోడీతో ఎప్పుడూ మంచి స్నేహంగా ఉంటానని చెప్పుకొచ్చారు.
వైట్‌హౌస్ వేదికగా దిగ్గజ టెక్ సీఈవోలందరికీ ట్రంప్ ప్రత్యేక విందు ఇచ్చారు. విందులో ట్రంప్ దంపతులిద్దరూ హాజరయ్యారు. విందులో సీఈవోలతో ట్రంప్ ప్రత్యేకంగా ఒక్కొక్కరితో సంభాషించారు. సొంత దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని కోరారు.
భారత్‌పై ట్రంప్ కక్ష కట్టినట్లుగా మరోసారి రుజువైంది. ఇప్పటికే సుంకాల పేరుతో భారీ బాదుడు బాదుతున్నారు. తాజాగా వైట్‌హౌస్ వేదికగా టెక్ సీఈవోలకు ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ విందు సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.
ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య స్నేహం ముగిసినట్లుగా భావిస్తున్నట్లు అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ స్పష్టం చేశారు. బ్రిటిష్ మీడియా పోర్టల్ ఎల్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోల్టన్ మాట్లాడారు.