Trump's Tariff: డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ప్రపంచ దేశాలపై సుంకాలను ప్రకటించబోతున్నాడు. ఏప్రిల్ 2 ‘‘విముక్తి దినోత్సం’’ సందర్భంగా ఇండియాతో పాటు ఇతర దేశాలపై సుంకాలు విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సుంకాలు ఏ విధంగా ఉంటాయనే దానిపై అంతా ఉత్కంఠత నెలకొంది. పరస్పర సుంకాలు ఏప్రిల్ 3 నుంచి అమలులోకి వస్తాయని వైట్ హౌజ్ మంగళవారం తెలిపింది.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సుంకాలతో ప్రపంచ దేశాలును బెదిరిస్తున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాల సుంకాలను విధించారు. తాజాగా, ఆయన సుంకాలపై సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. గురువారం ట్రంప్ ‘పరస్పర సుంకాల’ను ఆవిష్కరించాలని యోచిస్తున్నట్లు చెప్పారు.