భారతదేశం, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణలో తన పరిపాలనా వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. భారత్, పాకిస్థాన్ మధ్య అణు యుద్ధం లాంటి పరిస్థితిని నివారించడంలో అమెరికా పెద్ద దౌత్య విజయాన్ని సాధించిందని చెప్పారు. అయితే ఈ అంశంలో తనకు సరైన క్రెడిట్ ఇవ్వలేదని ట్రంప్ శనివారం ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
అగ్ర రాజ్యం అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ-ట్రంప్ ప్రభుత్వం మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి 2.2 బిలియన్ డాలర్ల నిధులను ట్రంప్ సర్కార్ నిలిపివేసింది. అంతేకాకుండా యూనివర్సిటీకి కల్పించే పన్ను మినహాయింపును కూడా నిలిపివేసింది. దీంతో హార్వర్డ్ యూనివర్సిటీ-ట్రంప్ సర్కార్ ప్రత్యక్ష పోరాటానికి దిగింది.
న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సాయంత్రం అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బర్డ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం, భద్రతా పరిస్థితులపై విస్తృతంగా చర్చలు జరిపారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో ప్రభుత్వ వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించేందుకు ఆయన తీసుకుంటున్న చర్యలు గమనిస్తే, ఆయన కొంత మంది ఉద్యోగులను తక్షణమే విరమించుకోమని కోరాడు. ఈ క్రమంలో ఫెడరల్ ఉద్యోగులు (ప్రభుత్వ ఉద్యోగులు) స్వచ్ఛందంగా రాజీనామా చేసేందుకు ఆసక్తి చూపితే వారికి 8 నెలల జీతం ఇచ్చే ఆఫర్‌ను ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం, ఫిబ్రవరి 6లోపు ఉద్యోగులు…
హెచ్-1బీ వీసాదారులైన భారతీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ ఉపశమనం ప్రకటించారు. NYT ప్రకారం.. ఈ వీసాలు నిలిపివేయబడవని ట్రంప్ అన్నారు. అమెరికాకు ప్రతిభ కావాలని.. తమకు ఇంజనీర్లు మాత్రమే అవసరమని ట్రంప్ పేర్కొన్నట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది. H-1బీపై జరుగుతున్న చర్చ గురించి ట్రంప్‌ను ప్రశ్నించగా.. "నేను అనుకూల, ప్రతికూల వాదనలతో ఏకీభవిస్తున్నాను. ప్రస్తుతం అమెరికాకు అవసరమైన ప్రతిభను ఈ వీసా ప్రోగ్రామ్ ద్వారా మాత్రమే కనుగొనవచ్చు. ఈ వీసాలు నిలిపి వేయం."…
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వారంలోనే ఆయన చేసిన ప్రకటనతో అమెరికాలో నివసిస్తున్న వలసదారులలో భయాందోళనలు నెలకొన్నాయి. అమెరికాలోని చాలా మంది భారతీయ విద్యార్థులు కళాశాల సమయం ముగిసిన తర్వాత పార్ట్ టైమ్ పని చేస్తూ డబ్బు సంపాదించేవారు. ఇప్పుడు వారు తమ పనిని వదిలివేశారు. ఓ జాతీయ మీడియాతో అక్కడున్న కొందరు విద్యార్థులు మాట్లాడారు. ఈ విద్యార్థులలో కొందరు, యూఎస్‌లో మనుగడ సాగించడానికి…
డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన 72 గంటల్లోనే అక్రమ వలసదారులపై ప్రభుత్వం భారీ చర్యలు ప్రారంభించింది. దీంతో డ్రీమ్‌ను వెతుక్కుంటూ అమెరికాకు వచ్చిన లక్షల మంది వలసదారులపై అధికారులు అతి పెద్ద ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు. 12 నుంచి 15 గంటల్లోనే ట్రంప్ ప్రభుత్వం వేలాది మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసి అదుపులోకి తీసుకుంది. ఇప్పటివరకు 538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశామని, 373 మందిని అదుపులోకి తీసుకుని శిబిరాలకు పంపామని వైట్‌హౌస్ ట్వీట్…
ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ సిబ్బంది అందరికీ లేఆఫ్‌లు ఇవ్వడానికి ట్రంప్ కార్యవర్గం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వారందరినీ సెలవులో ఉంచాలని జీవో జారీ చేసింది. ఇక, అమెరికా ఫెడరల్ ప్రభుత్వానికి చెందిన డైవర్సిటీ, ఇన్‌క్లూజన్ ప్రోగ్రామ్‌లను నిర్వీర్యం చేయడానికి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం పెట్టారు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. వచ్చి రావడంతోనే అక్రమ వలసదారుల బహిష్కరణ, జన్మత: పౌరసత్వం(బర్త్‌రైట్ సిటిజన్‌షిప్)పై పని మొదలుపెట్టారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ఈ రెండు హామీలపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే వీటిపై ‘‘ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్’’ పాస్ చేశాడు. ఇదిలా ఉంటే,