H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలు, ఇమ్మిగ్రేషన్ విధానాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు H-1B వీసా విధానంపై అనేక కొత్త నిబంధనలు తీసుకువస్తున్నాడు. H-1B వీసాల ద్వారా విదేశీయులు, అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
USA: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరసగా భారతీయులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాడు. ఇప్పటికే, ట్రంప్ ఇమ్మిగ్రేషన్, వలస విధానాలను కఠినతరం చేశాడు. ఇప్పుడు ఆయన దృష్టి H-1B వీసాలపై పడింది. ఈ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయని, అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని ట్రంప్ ప్రభుత్వంలోని వ్యక్తులు ఆరోపిస్తున్నారు.
ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ వలసలు, టారిఫ్స్ వంటి వాటిపై షాకింగ్ డెసిషన్స్ తీసుకుంటూ ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నారు. ఇప్పుడు విదేశీ విద్యా్ర్థులపై ఆంక్షలకు తెరలేపారు. అమెరికాకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలనే కాంక్ష ఉన్నవారికి బిగ్ షాక్ తగిలినట్లే. ట్రంప్ ప్రభుత్వం తొమ్మిది విశ్వవిద్యాలయాలకు ఒక మెమో పంపింది. అవి సమాఖ్య నిధులను కొనసాగించాలనుకుంటే కఠినమైన కొత్త షరతులను పాటించాలని కోరింది. ఈ విశ్వవిద్యాలయాలలో భారతీయ విద్యార్థులతో సహా అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై…
H-1B visa fee hike: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. H-1B వీసాలపై USD 100,000 (రూ. 88 లక్షలకు పైగా) వార్షిక రుసుము విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఇది ప్రధానంగా నైపుణ్యం కలిగిన భారతీయ వర్కర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే, ఈ నిర్ణయంతో అమెరికా సెల్ఫ్ గోల్ చేసుకుందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇది భారత్‌కు కలిసి వస్తుందని అంటున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై అక్కసు వెల్లగక్కకుతున్నాడు. భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు. అమెరికా విధించిన విధంగానే భారతదేశంపై ఆంక్షలు విధించాలని వైట్ హౌస్ యూరోపియన్ దేశాలకు విజ్ఞప్తి చేసిందని సమాచారం. ఈ ఆంక్షలలో యూరప్ భారతదేశం నుంచి చమురు, గ్యాస్ కొనుగోలును వెంటనే నిలిపివేయాలని ఉందని తెలిసింది. ఆగస్టు 27 నుండి అమెరికా భారతదేశంపై ఇప్పటికే 50 శాతం సుంకాన్ని విధించింది. అయితే, భారతదేశంపై సుంకాలకు సంబంధించి ఏ యూరోపియన్…
Tariff Deadline: సుంకాల విధింపుకు సంబంధించి డెడ్‌లైన్ గురించి అమెరికా క్లారిటీ ఇచ్చింది. సుంకాలు విధించడానికి ఆగస్టు 1నాటి తుది గడువు ఎట్టి పరిస్థితుల్లో మారదని, ఎలాంటి పొడగింపులు ఉండవని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఆదివారం చెప్పారు. ‘‘ఇక పొడగింపులు లేవు, ఇక గ్రేస్ పిరియడ్‌లు లేవు. ఆగస్టు 1న, సుంకాలు నిర్ణయించబడ్డాయి. అవి అమలులోకి వస్తాయి. కస్టమ్స్ డబ్బు వసూలు చేయడం ప్రారంభిస్తాయి.’’ అని ఓ అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్టించారు. అధికారంలోకి రాగానే వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్రంప్ అమెరికాకు పునర్ వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నారు. కానీ పెరుగుతున్న అప్పును నియంత్రించడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారు.
అమెరికాలో మరొక యూనివర్సిటీకి ట్రంప్ సర్కా్ర్‌తో ముప్పు వచ్చి పడింది. ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. యూదులకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయం పని చేస్తుందంటూ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. విదేశీ విద్యార్థులను చేర్చుకోకుండా సర్టిఫికేషన్‌ను రద్దు చేసింది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ బిలియనీర్, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ పై ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వంలో వ్యర్థ ఖర్చుల నివారణ కోసం ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) చీఫ్ పదవి నుంచి మస్క్ తప్పుకుంటున్న నేపథ్యంలో ట్రంప్ స్పందించారు. ఇందులో భాగంగా “ఎలాన్ మస్క్ అద్భుతమైన వ్యక్తి. ఇది ఆయన చివరి రోజు అయినా, ఆయన మనతోనే ఉంటారు. ఎల్లప్పుడూ సహాయపడుతూనే ఉంటారు” అని ట్రంప్ అన్నారు.…
Elon Musk: టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల సీఈవో.. ప్రపంచ కుబేరులలో ఒకరైన ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన నుంచి వైదొలిగారు. ఫెడరల్ ప్రభుత్వంలో పునర్ఘటనం, వ్యర్థ వ్యయాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన “Department of Government Efficiency (DOGE)”లో ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన పనిచేశారు. తన అధికారిక పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో మస్క్ బుధవారం X ద్వారా ఈ ప్రకటన చేశారు. ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా నా నిర్ణీత కాలం…