న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సాయంత్రం అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బర్డ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం, భద్రతా పరిస్థితులపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఇస్లామిక్ ఉగ్రవాద ముప్పును ఓడించడానికి తులసి గబ్బర్డ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఉగ్రవాదంపై అచంచలమైన నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఇది అమెరికన్ ప్రజలకు “ప్రత్యక్ష ముప్పు”గా అభివర్ణించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీతో కలిసి పరిగణిస్తామని తెలిపారు. ఈ నిరంతర ముప్పును ఎదుర్కోవడానికి రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని తులసి గబ్బర్డ్ పేర్కొన్నారు.
Read Also: Bulliraju : బుల్లిరాజు భారీ రెమ్యునరేషన్.. రోజుకు ఎంతో తెలుసా..?
ఉగ్రవాదం గురించి
ఉగ్రవాదం గురించి తులసి గబ్బర్డ్ మాట్లాడుతూ.. భారతదేశం, బంగ్లాదేశ్, సిరియా, ఇజ్రాయెల్, మధ్యప్రాచ్యంలోని అనేక దేశాలు దీనివల్ల తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి” అన్నారు. ఉగ్రవాద ముప్పును ప్రతిఘటించడానికి రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రధాని మోడీ కూడా ఈ ముప్పు యొక్క తీవ్రతను గుర్తిస్తూ, రెండు దేశాలు సమన్వయంగా దానిపై చర్యలు తీసుకుంటాయని గబ్బర్డ్ వెల్లడించారు.
ఖలిస్తానీ ఉగ్రవాదంపై చర్చ
ప్రధాని మోడీతో సమావేశానికి ముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తులసి గబ్బర్డ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ “సిఖ్ ఫర్ జస్టిస్”, దాని వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నుపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమెరికా గడ్డపై భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ ఉగ్రవాద సంస్థపై.. అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారత్ కోరింది.
చైనా సైన్యం దూకుడుపై చర్చ
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా సైన్యం సైనిక దృఢత్వం పెరుగుతున్న నేపథ్యంలో చర్చలు జరిగాయి. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, తులసి గబ్బర్డ్ ఆదివారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇండియా నిర్వహించిన భద్రతా సమావేశంలో తులసి గబ్బర్డ్, కెనడా ఇంటెలిజెన్స్ చీఫ్ డేనియల్ రోజర్స్, బ్రిటన్ జాతీయ భద్రతా సలహాదారు జోనాథన్ పావెల్ పాల్గొన్నారు. ఈ క్లోజ్డ్ డోర్ సమావేశంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. ఉగ్రవాదం, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల వల్ల కలిగే భద్రతా ముప్పులను ఎదుర్కోవడానికి నిఘా సమాచారం భాగస్వామ్యం, పరస్పర సహకారంపై దృష్టి సారించారు.