ఖమ్మం జిల్లా చీమలపాడు అగ్నిప్రమాద బాధితులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు బాధితులు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈనేపథ్యంలో ఇవాల (గురువారం) ఉదయం మంత్రి కేటీఆర్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి నిమ్స్‌కు చేరుకుని బాధితులను పరామర్శించారు.
Minister KTR: అకాల వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న రైతులకు వెన్నంటే ఉండాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్ సూచించారు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
Off The Record: అనారోగ్యంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాలం చేసినా.. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం ఉపఎన్నిక వచ్చే అవకాశం లేదు. ఈ ఏడాది చివర్లో షెడ్యులు ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో సాంకేతికంగా కంటోన్మెంట్ కు ఉపఎన్నిక నిర్వహించే ఛాన్స్ లేదు. అయినప్పటికీ ఎస్సీ రిజర్డ్వ్ అయిన ఈ సీటుపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. సాయన్న ఉండగానే అనేక మంది తమ స్థాయిలో లాబీయింగ్ చేసిన ఉదంతాలు ఉన్నాయి.…
Off The Record: తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి సభ్యులుగా ఈసారి ఎవరికి అవకాశం వస్తుందనే ఉత్కంఠ అధికారపార్టీలో నెలకొంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో పదవీకాలం ముగిసే ముగ్గురులో ఒకరికి రెన్యువల్ ఛాన్స్ ఉంది. రెండేళ్లు మాత్రమే పదవీలో ఉన్న కూర్మయ్యగారి నవీన్‌కుమార్‌కు మరోసారి అవకాశం ఇస్తారని సమాచారం. మిగిలిన ఇద్దరు ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్ ఔట్ అయినట్టే. గంగాధర్ గౌడ్ రెండుసార్లు MLA కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. వయసు మీద పడటం, అనారోగ్యం కారణంగా…
పటాన్ చెరువులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాపాల రెడ్డిగా మారారని బీజేపీ పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా శివరాత్రి జాగరణ పేరుతో మహిపాల్ రెడ్డి సినీ ఆర్టిస్టులతో హిందూ ధర్మాన్ని అపహస్యం చేశారని నందీశ్వర్ గౌడ్ మండిపడ్డారు.
Off The Record: ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే రాములు నాయక్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌కే చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు గళం విప్పారు. ఎమ్మెల్యే వల్ల తమకు ప్రయోజనం లేదని నినదిస్తున్నారు. వైరా మున్సిపాలిటీగా మారి మూడేళ్లే అయ్యింది. నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాగుతుందని వారు ప్రశ్నిస్తున్నా అసలు కారణాలు వేరే ఉన్నాయని టాక్. తాము తెలంగాణలో లేమా అని ప్రశ్నిస్తూ ఓ మామిడి తోటలో విందు రాజకీయాలకు…
Peddi Sudarshan Reddy comments: తెలంగాణ ప్రభుత్వం సాగు, తాగు నీటి సౌకర్యాలను కల్పించిందని..దీంతో తెలంగాణ వ్యాప్తంగా పంటల దిగుబడి పెరిగిందని, వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా గోదావరి జలాలతో పంటల దిగుబడి గణనీయంగా పెరిగినట్లు వెల్లడించారు. సంక్రాంతి పండగ సందర్భంగా నర్సంపేటలో శాంతిసేన రైతు సంఘం నిర్వహించిన పశువుల అందాల పోటీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.