ఈటలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది టీఆర్ఎస్. ఇవాళ టీఆర్ఎస్, ఎమ్యెల్యే పదవికి ఈటల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు ఈటల. అయితే ఈటల వ్యాఖ్యలపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈటల ప్రయత్నాలు ఆత్మగౌరవం కోసం కాదు.. ఆస్తుల రక్షణ కోసమేనని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎంతో మందిని కెసిఆర్ నాయకులుగా తయారు చేశారని.. అనామకుడు ఇచ్చిన ఫిర్యాదుపై సిఎం కెసిఆర్ స్పందించారంటే అది నియంతృత్వం…
టీఆర్ఎస్ బహిస్కృత నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రకటించారు. ఉరిశిక్షపడిన ఖైదీకి కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని, కానీ, ఏం జరిగిందో తెలుసుకోకుండా చర్యలు తీసుకున్నారని, రాత్రికి రాత్రే విచారణ చేసి బర్త్‌రఫ్ చేశారని ఈటల ఆరోపించారు. 19 ఏళ్లుగా టీఆర్ఎస్‌లో ఉన్నానని, ఓ అనామకుడు లేఖరాస్తే రాత్రికి…
కరోనా మహమ్మారి బారినపడి ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు వదిలారు.. ఇక, సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసుల సంఖ్యే కాదు.. మృతుల సంఖ్య కూడా భారీగా నమోదు అయ్యింది.. ప్రముఖులు, ప్రజాప్రతినిధులతో పాటు.. కొందరు రాజకీయ పార్టీల నేతలను కూడా కరోనా ప్రాణాలు తీసింది.. ఇవాళ టీఆర్‌ఎస్ నేత, కార్మిక సంఘాల నేత, మహబూబాబాద్ జిల్లా తొరూరు మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ మాడ్గుల నట్వర్… ఇవాళ ఉదయం మరణించారు.. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ…
తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని నియమించారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్… చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు పదవులు ఖాళీ కావడంతో ప్రొటెం చైర్మన్‌ను గవర్నర్ నియమించారు. మండలికి చైర్మన్‌ను ఎన్నుకునే వరకు భూపాల్ రెడ్డి ఆ పదవిలో కొనసాగనున్నారు. కొత్తగా ఎన్నికయ్యే మండలి సభ్యుల చేత పదవీ స్వీకార ప్రమాణం చేయించడం, కొత్త చైర్మన్‌ను ఎన్నుకోవటం, ఇతర మండలి వ్యవహారాలు చూసుకొంటారు. సాధారణ…
ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్ గ్రామాలకు చెందిన రైతుల భూములపై మంత్రి ఈటల కబ్జా పెట్టారనే ఆరోపణలు తెలంగాణ రాజకీయాలను కుదిపేశాయి. కబ్జా ఆరోపణలతో ఈటల రాజేందర్ మంత్రి పదవి పోయింది.. దీంతో.. ప్రత్యామ్నాయ రాజకీయ వేదికపై తర్జనభర్జన పడిన టీఆర్ఎస్ సీనియర్ నేత.. అన్ని పార్టీల నేతలతో చర్చలు జరిపారు.. చివరకు భారతీయ జనతా పార్టీ వైపే ఆయన…
టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే అని తెలిపారు భట్టి విక్రమార్క. ఆరేళ్లలో ఆరు కోట్లు అప్పు చేసింది తెరాస. ఈటల నన్ను కలిసినప్పుడు జరుగుతున్న అవమానం పై అన్ని పార్టీల కలుస్తా అన్నారు. కేంద్రంతో రక్షణ పొందుదాం అని బీజేపీ లోకి కొందరు వెళ్తున్నారు. టీఆర్ఎస్ తో పోరాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేది కాంగ్రెస్ మాత్రమే అని పేర్కొన్నారు. ఫిరాయింపులపై స్పీకర్ కి ఫిర్యాదులు చేశాం. మా పిటిషన్ పెండింగ్ లో పెట్టీ..12 మంది పార్టీ…
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుటుందో తెలంగాణ.. ఈ సమయంలో.. తమ వల్లే రాష్ట్రం సాధ్యమైందనే.. తాము లేకపోతే రాష్ట్రం ఏర్పాటు అయ్యేది కాదని ఎవ్వరికి వారు చెప్పుకుంటున్నారు.. తాజాగా తెలంగాణ ఉద్యమంపై స్పందించిన బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి.. తెలంగాణ రాష్ట్ర ఆలోచన మొదట బీజేపీదే అన్నారు.. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పింది బీజేపీయేనని ఆమె గుర్తుచేశారు.. ఇక, తెలంగాణ ఉద్యమంలోకి టీఆర్ఎస్ లేట్‌గా వచ్చిందని కామెంట్ చేశారు.. కేసీఆర్ ఉద్యమ సమయంలో…
సిఎం కెసిఆర్ పై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీళ్లు నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని.. తెలంగాణ వచ్చాక ..నీళ్లు ఫామ్ హౌజ్ కు, నిధులు సీఎం అనుయాయులకు, నియామకాలు ఆయన ఫ్యామిలకే పోయాయని ఫైర్ అయ్యారు. తొలి దశ, మలి దశ ఉద్యమానికి ఊపిరే యువత అని..ఆ యువత తెలంగాణ ఏర్పడ్డాక 7 ఏళ్లుగా ఉద్యోగం, ఉపాధి లేక అల్లాడుతోందన్నారు. లక్షలాది మంది యువతీ,…
మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంపై సీరియస్ అయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈటల విషయంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్.. ఎప్పుడు ఏ చర్య అవసరం అనుకుంటే ఆ చర్య తీసుకుంటారని ప్రకటించారు. ఇక, ఈటల ఇప్పటి వరకు చెబుతూ వచ్చిన బహుజన వాదం, వామపక్ష వాదం ఎక్కడికి పోయిందని ప్రశ్నించిన రాజేశ్వర్‌రెడ్డి.. 40 ఎకరాల అసైన్డ్ భూమి తీసుకున్నానని ఈటల స్వయంగా ఒప్పుకున్నారని వ్యాఖ్యానించారు.. వైఎస్, రోషయ్య, కిరణ్…