తెలంగాణ మంత్రి వ్యాఖ్యలకు రోజా కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం మరింత ముదిరి మాటల యుద్ధానికి తెరలేచింది.. తాజాగా, తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె.. ఒక మంత్రి అయిఉండి ముఖ్యమంత్రిని గజదొంగ అని వ్యాఖ్యానించటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు.. ఏపీకి కేటాయించిన నీళ్లు కాకుండా అదనంగా చుక్క నీళ్లు కూడా వాడుకోవటం లేదనే విషయం తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలుసుకోవాలని.. ప్రజల మనుసుల్లో విషం చిమ్మే ప్రయత్నం చేయటం మంచిదికాదని హితవుపలికారు.. మరోవైపు సీతానగరం ఘటనపై స్పందించిన ఆమె.. ఆ ఘటన దురదృష్టకరం అన్నారు.. టీడీపీ హయాంలో ఎంతో మంది అమ్మాయిలపై అత్యాచార ఘటనలు జరిగాయన్న వైసీపీ ఎమ్మెల్యే.. రాజకీయ ఒత్తిడిలతో ఒక్కరికి కూడా శిక్ష వేసే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు.. ఒక ఘటనతో టీడీపీ నేతలు విమర్శలకు దిగటం విడ్డూరం అన్నారు రోజా.. రితికేష్వరి, వనజాక్షి ఘటనలపై అప్పుడు చంద్రబాబు, టీడీపీ మహిళా నాయకులు ఏం చేశారు? అంటూ ఫైర్ అయ్యారు. కాగా, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్‌పై మంత్రి ప్రశాంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీటిని తరలించి, ఆనాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నీటి దొంగ అయ్యాడని.. ఇవాళ వారి కొడుకైనా మారాడనుకుంటే లంకలో ఉన్నవాళ్లంతా రాక్షసులే అన్నట్టుగా.. సీఎం వైఎస్ జగన్ దొంగతనంగా ప్రాజెక్టులు కడుతున్నారని.. రాయలసీమ ప్రాజెక్ట్, ఆర్డీఎస్ రైట్ కెనాల్ కట్టి జగన్ గజదొంగ అయ్యారంటూ హాట్ కామెంట్ చేయడం వివాదాస్పదమైంది.
Also Read
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
- CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
తాజావార్తలు
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?