Tarun Chugh: నిన్న సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. ఢిల్లీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మునుగొడులో బీజేపీ గెలుపుకోసం అందరూ కృషి చేశారని అన్నారు. మా కోసం పని చేసిన వాళ్లందరికీ ధన్యవాదాలని తెలిపారు. మునుగొడులో ధనబలంతో పాటూ, అధికార దుర్వినియోగానికి టీఆర్‌ఎస్ పడిందని ఆరోపించారు. బీజేపీ మునుగొడులో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటింగ్ మొదలవ్వడానికి ముందు కూడా మంత్రులు, నాయకులు మునుగొడులోనే ఉన్నారని ఆయన తెలిపారు. ఫామ్ హౌస్ విషయంపై మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ పీఎం కావాలని కలలు కంటున్నారని, ప్రధాని మోడీపై ఆరోపణలు చేసున్నారని తరుణ్ చుగ్ అన్నారు. మోడీ దేశాన్ని బలోపేతం చేస్తున్నారని అన్నారు. ప్రధాని చేసిన అభివృద్ధిపై ఎక్కడయినా చర్చించేందుకు మేం సిద్ధమని అన్నారు.
మీరు చేసింది చెప్పడానికి ఏమయినా ఉందా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ కు ప్రజలు బై బై చెప్తారని ఎద్దేవ చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రి ని మొదటి సారి చూస్తున్నామని మండిపడ్డారు. వాళ్ళతో మాకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే గుడిలో బండి సంజయ్ ప్రమాణం చేశారని, కేసీఆర్ అబద్ధం చెప్తున్నారని ఆరోపించారు. ఒక్క ఎమ్మెల్యే ను కొనేందుకు కూడా మేం డబ్బు ఖర్చు పెట్టలేదని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. దేవుడిపై కేసీఆర్ కు విశ్వాసం లేకపోతే, ఈడీ ఎంక్వయిరీకి సైతం మేం సిద్ధమని సవాల్ విసిరారు. దేవుడి ముందు ప్రమాణం చేసేందుకు ఎందుకు భయపడుతున్నారు? అంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో అవసరం అయితే న్యాయ పోరాటానికి సైతం సిద్ధం అవుతామని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు.