DK Aruna : ఇదంతా డ్రామా అని ప్రతిఒక్కరికీ అర్థమైంది.. నువ్వు ఇచ్చిన హామీల వీడియోలు ఒకసారి చూడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ నిన్న మీడియా సమావేశం నిర్వహించి మొయినాబాద్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై వీడియోలు విడుదల చేశారు. అంతేకాకుండా.. బీజేపీ అగ్రనేతలతో పాటు అవలంభిస్తున్న తీరుపై విమర్శలు గుప్పించారు. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. తాజాగా డీకే అరుణ మాట్లాడుతూ.. మీ ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చారో? ఇంకా దేనికి వచ్చారో ఇప్పటి వరకు మీకే క్లారిటీ లేదని ఆమె విమర్శించారు. కానీ కేసీఆర్ కు మాత్రం చాలా క్లారిటీ ఉందని, ఎందుకంటే ఇదంతా చేయించింది ఆయనే కాబట్టి అంటూ ఆమె మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే నవ్వాలో.. ఏడవాలో తెలియడంలేదని ఆమె ఎద్దేవా చేశారు. ప్రెస్ మీట్ లో మిమ్మల్ని ఎవరూ ప్రశ్నించొద్దా? అని ఆమె ధ్వజమెత్తారు. దళితులంటే చాలా గౌరవమన్నారు.. మరి కొప్పుల ఈశ్వర్ ను ఎందుకు సమావేశం నుంచి పక్కకు పంపించారు అని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా.. దళిత వ్యక్తులు, ఎమ్మెల్యేలంటే కనీస గౌరవం లేదని ఆమె దుయ్యబట్టారు.
Also Read : Kishan Reddy: మీ ఎమ్మెల్యేలను కొనే ఖర్మ మాకు లేదు
వారికే కాదు ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా విలువ లేదని, ఫాంహౌజ్ లోని నలుగురు ఎమ్మెల్యేలను మాత్రం వెంటే పెట్టుకుని తిరుగుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఇదేనా ప్రజాస్వామం, స్వేచ్ఛ అని ఆమె ప్రశ్నించారు. ఇదంతా డ్రామా అని ప్రతిఒక్కరికీ అర్థమైందని, బీజేపీని విమర్శించే అర్హత కేసీఆర్ కు లేదని ఆమె అన్నారు. రాజ్యాంగాన్ని మార్చేంతటి ఘనుడు కేసీఆర్ అని ఆమె చురకలు అంటించారు. ఆయన నీతిమంతుడైతే మాట్లాడాలని, నువ్వెన్ని లక్షల కోట్లు సంపాదించావో.. గతంలో నీ కుటుంబం పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడెలా సంపాదించావు అని, ప్రజలు మీకు భయపడి, అహంకారానికి గురై సైలెంట్ గా ఉండొచ్చని, ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు మీరు కొనుక్కున్న వారే ఉన్నారని ఆమె అన్నారు. మీరు కొంటే తప్పులేదు.. మేము రాజీనామా చేయించి గెలిస్తే అప్రజాస్వామ్యమా? అని ఆమె అన్నారు. ఆడియోలో ఏముందో.. వీడియోలో కూడా అదే ఉందని, ప్రధాని మోడీ.. నీలాగ మోసపు మాటలు మాట్లాడలేదని, నువ్వు ఇచ్చిన హామీల వీడియోలు ఒకసారి చూడు అంటూ ఆమె హితవు పలికారు.
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!