రాష్ట్రమంతా హుజురాబాద్ ఉప ఎన్నిక మేనియా నడుస్తోంది. ఏ రాజకీయ పార్టీ నాయకులు ఎక్కడికి వచ్చి మాట్లాడినా అందులో హుజురాబాద్ ఉప ఎన్నిక గురించి తప్పక ఉంటోంది. ఈ రోజు కేటీఆర్ టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాల కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్, పీసీసీ రేవంత్ రెడ్డిలు రహస్య ఒప్పందాలు చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై స్పందించిన బీజేపీ మహిళా నేత డీకే అరుణ హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్, ఈటల భేటీ…
హుజురాబాద్ బైపోల్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీలు ప్రచారంలో స్పీడ్‌ను పెంచాయి. హుజురాబాద్ మండలం సింగాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్ అధికార టీఆర్‌ఎస్ పార్టీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ వి అన్ని అబద్ధాలు, మోసాలేనని అన్నారు. హుజూరాబాద్ లో టీఆర్‌ఎస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు. మీటింగ్‌కి పోవద్దు అని డబ్బులు ఇచ్చే దుర్మార్గ పరిస్థితికి టీఆర్ఎస్ దిగజారిందన్నారు. పిల్లిని రూంలో వేసి కొడితే…
తెలంగాణ రాష్ట్రంలోని పోడు భూముల సమస్య పరిష్కారం పై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కాసేపటి క్రితమే ప్రగతి భవన్ లో ప్రారంభమైన ఈ సమీక్షా సమావేశంలో అడవుల పరి రక్షణ, హరిత హారంపై చర్చిస్తున్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించనున్నారు. అడవులు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై, హరిత హారం ద్వారా విస్తృత ఫలితాల కోసం ప్రణాళికలపై చర్చించనున్నారు. పోడు సమస్యపై అటవీ, గిరిజన సంక్షేమ శాఖల…
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. టీఆర్ఎస్ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ ఇంకా క్షేత్రస్థాయిలో బలపడాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించారు. ఈమేరకు గులాబీ బాస్ ఆదేశాలతో నేతలంతా ఆయా జిల్లాలో టీఆర్ఎస్ సభ్యత్వాలను రికార్డు స్థాయిలో నమోదు చేయించి సంస్థాగత ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే గ్రామ, పట్టణ, మండల కమిటీల ఎంపికను టీఆర్ఎస్ అధిష్టానం దాదాపు పూర్తి చేసింది. ఇక జిల్లా కమిటీలు సైతం సెప్టెంబర్ లేదా అక్టోబర్…
మరో వారం రోజుల్లో హుజురాబాద్ ఉపఎన్నిక జరగనుంది. ప్రచారానికి మిగిలింది మరో నాలుగు రోజులే. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు ప్రచారాన్ని స్పీడప్ చేశాయి. ముఖ్య నేతలంతా అక్కడే మకాం వేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ప్రజా నాడి ఎలా ఉందనే దానిపై పరిశీలనలు చేస్తూనే.. ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకెళుతున్నారు. మూడు ప్రధాన పార్టీలు బరిలో నిలిచినా.. పోటీ మాత్రం టీఆర్ఎస్-బీజేపీ మధ్యే ఉంది. హుజురాబాద్ బైపోల్ ఈనెల 30న జరగనుంది. నవంబర్2న రిజల్ట్స్.…
హుజురాబాద్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారంలో వేడి పెరుగుతోంది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బీజేపీ సిగ్గులేని రాజకీయాలు మానుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కి ఓటమి భయం పట్టుకుంది. అందుకే దాడులకు దిగుతోందని బాల్క సుమన్ ఆరోపించారు. బీజేపీ గెలిచే పరిస్థితే ఉంటే.. దాడులకు దిగుతుందా..? అని ప్రశ్నించారు. బీజేపీ ఫ్రెస్టేషన్‌లో ఉందని, కిషన్ రెడ్డి తన స్థాయిని మరిచి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. Read Also…
మాజీ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రతిపక్ష నాయకులపై కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ సంపద మీద ఆశతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల పాదయాత్రలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రగతిపథంలో దేశంలోనే అగ్రభాగంలో ఉందని.. దీన్ని కొన్ని పార్టీలు జీర్ణించుకోలేక పోతున్నాయన్నారు. కొన్ని పార్టీలు పాదయాత్రల పేరుతో తెలంగాణను, సీఎం కేసీఆర్ ను అపఖ్యాతి చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆశతో ఉన్నోడికి అధికారం ఇస్తే దోచుకుంటాడు.. ఆశయంతో ఉన్నవారికి అధికారమిస్తే అభివృద్ధి చేస్తారని దానికి నిదర్శనమే కేసీఆర్…
హుజురాబాద్‌లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయం వేడుక్కుతుంది. మాటల యుద్ధం కాస్త ఘర్షణల వరకు దారి తీస్తుంది. శుక్రవారం ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరపున ప్రచారం నిర్వహించారు. అటుగా ర్యాలీతో వస్తున్న టీఆర్‌ఎస్, బీజేపీ ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఘర్షణను శాంతింపజేసేందుకు ప్రయత్నించిన ట్రైనీ ఎస్సై రజినికాంత్ పై టీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రవీణ్, చిన్నరాయుడు దాడికి పాల్పడ్డారు. దీనిపై…
అసైన్డ్ భూముల ఆక్రమణ ఆరోపణలతో మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్‌ను రాష్ట్ర ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. దీంతో ఆత్మగౌరవం అంటూ ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఈటల సోలోగా ఉప ఎన్నిక బరిలో దిగుతారని, సొంత పార్టీ పెడుతారంటూ చాలానే వార్తలు వచ్చాయి. కానీ ఈటల అనూహ్యంగా బీజేపీలోకి చేరారు. దీంతో ఈటల ఒంటిరిగా పోరాడుతాడనుకున్న గులాబి నేతలకు షాక్ తగిలినట్లైంది.…
తెలంగాణలో ఎన్నికలు వచ్చాయంటే చాలు అధికార టీఆర్ఎస్ పార్టీని ‘చపాతీ రోలర్’ వెంటాడుతూనే వస్తోంది.. స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ కేటాయించే ‘రొట్టెల పీట’ (చపాతీ రోలర్) కారు గుర్తుకు తలనొప్పిగా మారుతోంది. ఇప్పటికే తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఓటమి ప్రధాన కారణం ఈ చపాతీ రోలరే అని నిర్ధారణకు వచ్చిన టీఆర్ఎస్ నేతలు.. అంతే కాదు, దుబ్బాక బై…