గెల్చిన ఎమ్మెల్యే.. ఓడిన అభ్యర్థి ఇద్దరూ ప్రస్తుతం ఒకే పార్టీ. ఎవరి పదవి వాళ్లదే. అంతా బాగానే ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో ఎవరికి అసెంబ్లీ టికెట్ ఇస్తారు? సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఛాన్స్ ఉంటుందా? లేక ముందు నుంచీ పార్టీలో ఉన్న నేతను పిలుస్తారా? ఈ అంశం చుట్టూనే ఆసిఫాబాద్‌లో వాడీ వేడీ చర్చ జరుగుతోందట. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆసిఫాబాద్ టీఆర్‌ఎస్‌లో ఆధిపత్యపోరు..! ఈయన పేరు ఆత్రం సక్కు. కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే. 2018లో…
రాజకీయాల్లో గెలుపు కీలకం. లేదా చేతిలో ఏదైనా పదవి ఉండాలి. అవేమీ లేకపోతే ఎవరూ పట్టించుకోరు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో అలాంటి నాయకుల పరిస్థితి దుర్భరంగా మారిందట. ఒకప్పుడు వెలుగు వెలిగినా.. ఒకే ఒక్క ఓటమి పొలిటికల్ స్క్రీన్‌పై లేకుండా చేసేసింది. పార్టీ కార్యక్రమాల్లోనూ వారి పాత్ర లేకుండా పోయిందా? సన్నాహక సమావేశాల్లో కనిపించని ఓడిన ముఖ్య నేతలు..! టీఆర్ఎస్ ప్రయాణం ప్రారంభమై 20 ఏళ్లు. ఈ సందర్భంగా భారీ శక్తి ప్రదర్శనకు సిద్ధమవుతోంది పార్టీ. ముందుగా ప్రజాప్రతినిధుల…
హుజురాబాద్ ఎలక్షన్స్ దగ్గర పడతున్న కొద్ది ప్రచారంలో నేతల మాటల యుద్ధం తారా స్థాయికి చేరుతుంది. తాజాగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజశ్వేర్ రెడ్డి బీజేపీ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ధరలు తగ్గించడం చేతకాక నిందలు కేసీఆర్ పై వేస్తున్నారన్నారు. పెరిగినా పెట్రోల్, డీజీల్ ధరలకు బాధ్యత కేసీఆర్‌దే అని చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాలన్నారు. మోడీకీ పరిపాలనా చేతకాదు అని కిషన్‌రెడ్డి ఒప్పుకున్నట్టేనా అని ఎద్దేవా చేశారు. ధరలు తగ్గిస్తామని బీజేపీ అధికారంలోకి వచ్చిందని కానీ,…
దళితబంధు పథకం ప్రస్తుతం హుజురాబాద్ ఉపఎన్నికలో బర్నింగ్ టాపిక్..! ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత పొలిటికల్ తెరపైకి వచ్చిన ఈ అంశం.. అంతా అనుకున్నట్టే ఉపఎన్నికలో కీలకంగా మారింది. విమర్శలు.. ఆరోపణలే కాదు.. చర్చ.. రచ్చ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. మరి.. పార్టీలు ఆశిస్తున్నట్టు ఉపఎన్నికపై ప్రభావం ఉంటుందా? కీలక అంశంగా మారిన దళితబంధు..! ఈ నెల 30న హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్. ప్రచారపర్వం చివరి అంకానికి చేరుకుంటోంది. ప్రధానపార్టీల హోరాహోరీ పోరువల్ల నియోజకవర్గంలో ఎటు చూసినా…
హుజురాబాద్ లో ఈటల రాజేందర్ కు పద్మశాలి ఓట్లు అడిగే అర్హత కోల్పోయాడని ఎల్ రమణ ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ పట్టణంలో ని టిఆర్ఎస్ కార్యాలయంలో ఎల్ రమణ మాట్లాడుతూ… కేంద్రం లో బిజెపి ప్రభుత్వం వచ్చిన తరువాత చేనేత పరిశ్రమ నిధులు తగ్గించారని.. దేశంలో హ్యాండ్‌లూమ్ బోర్డును బిజెపి రద్దు చేసిందని నిప్పులు చెరిగారు. చేనేత పరిశ్రమ బీమా లు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్ర…
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని పునఃనిర్మించ తలపెట్టిన విషయం తెలిసిందే. వందల కోట్ల నిధులతో యాదాద్రి ఆలయాన్ని ప్రపంచంలోనే ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతిభ కలిగిన శిల్పకారులతో ఆలయంలోని స్థంభాలు డిజైన్ చేయిస్తున్నారు. యాదాద్రి ఆలయంలో అడుగడుగునా అబ్బురపరిచే కళానైపుణ్యం దర్శనమిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే యాదాద్రి ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం దాతలు బంగారాన్ని విరాళంగా ఇస్తున్నారు. ఇప్పటివరకు 36.16 కిలోల బంగారాన్ని దాతలు విరాళంగా…
నెల 27న హన్మకొండ జిల్లా పెంచికల్ పేటలో జరగాల్సిన సీఎం కేసీఆర్ అభినందన సభకు కేంద్ర ఎన్నికల కమిషన్ తాజా ఉత్తర్వులు అడ్డంకిగా మారింది. ఉప ఎన్నికతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న జిల్లాలు, చుట్టు పక్కల నియోజకవర్గాల్లో ఏ రాజకీయ కార్యకలాపాలు చేపట్టకూడదని సీఈసీ ఆదేశించడంతో…సభ రద్దయినట్టు తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ ఎలాంటి ప్రత్యామ్నాయాలు చేస్తుందనేది ఆసక్తిగా మారింది. దేశంలోని పలు నియోజకవర్గాల్లో ఉపఎన్నికల కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. బై…
టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన నాటి నుంచి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తెలంగాణలో అంపశయమీద ఉన్న కాంగ్రెస్‌కు ఊపిరిపోసి, కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపేందుకు అహర్నిషలు కష్టపుడుతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపడానికి రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి వెళుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి ప్రసంగించే విధానంతో కాంగ్రెస్ కు కరెక్టు నాయకుడు వచ్చాడని కార్యకర్తలు అంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో…
రావణ రాజ్యం పోవాలి.. రాముడి రాజ్యం రావాలి అంటూ పిలుపునిచ్చారు బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో రోడ్ షోలో పాల్గొన్న ఆమె.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరపున ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ ప్రచారం కంటే.. ప్రజల బీజేపీ ప్రచారం ఎక్కువగా ఉందన్నారు.. ప్రజలు బీజేపీ పార్టీ ప్రచారాన్ని భుజాన వేసుకున్నారన్న రాములమ్మ.. ఈటల రాజేందర్ ఆరు సార్లు గెలిచాడంటే ప్రజల మద్దతు ఎలా…
హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలిచేందుంకు టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తమదైన శైలిలో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక అన్నప్పటినుంచి అక్కడే ఉంటున్న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రజలను టీఆర్‌ఎస్ కు ఓట్లు వేసేందుకు వివిధ వరాలను గుప్పిస్తున్నారు. గురువారం జమ్మికుంట మండలం మాడిపల్లిలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో హరీశ్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలవనే గెలవదు.. గెల్చినా ఈటల మంత్రి అయ్యేది ఉందా.. నియోజకవర్గ పనులు చేసేది…