కరీంనగర్ జిల్లా హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ప్లానింగ్ కమీషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ మాట్లాడుతూ… ఈటల ఎందుకు రాజీనామా చేసిండో ఇప్పటి వరకు చెప్పలేదు. హుజురాబాద్ అభివృద్ధి పై ఇప్పటి వరకు ఈటల మాట్లాడటం లేదు. నీ సమస్య నీబాధ నియోజకవర్గం ప్రజల మీద రుద్దుతావ అని ప్రశ్నించారు. హుజురాబాద్ రైల్వే లైన్ ను రిజెక్ట్ చేస్తే ఎంపీ సంజయ్ ఎం మాట్లాడటం లేదు. సంజయ్ కి చేతకాకపోయినా నేను పట్టుపట్టి హుజురాబాద్…
హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి మరో వారం రోజులే మిగిలాయి. దాంతో క్యాంపెయిన్ తారా స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్స్ ఒక్కొక్కరుగా రంగంలో దిగుతున్నారు. అధికార పార్టీ నెల క్రితమే మంత్రి హరీష్ రావును రంగంలో దించింది. మరో రెండు ప్రధాన పార్టీలు తమ ముఖ్య నేతలను ప్రచారంలోకి దించాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కేసీఆర్‌కు ప్రతిష్టకు సవాలుగా మారింది. గెల్లును గెలిపించే బాధ్యతను మంత్రి హరీష్ రావు…
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను చేయాలని… గంజాయిపై యుద్ధం ప్రకటించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇవాళ డ్రగ్స్ మరియు గంజాయి అక్రమ రవాణా మరియు వాటి నియంత్రణ చర్యలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…. గంజాయి అక్రమ సాగు వినియోగంపై ఉక్కుపాదం మోపాలని…పరిస్థితి తీవ్రం కాకముందే అరికట్టాలని పేర్కొన్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నారని… తెలిసీ తెలియక దీని బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వినియోగం…
పార్టీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ఇవాళ కూకట్‌పల్లి, మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు చెందిన ప్రతినిధులతో సమావేశమైన ఆయన.. పార్టీ అభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై కీలక సూచనలు చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలలో టీఆర్ఎస్ బలంగా ఉందని తెలిపారు.. పార్టీ ఉంటేనే పదవులు ఉంటాయి.. ఆ పార్టీ కోసం అంతా కష్టపడి పనిచేయాలని సూచించారు.. ఇక, రాష్ట్ర ప్రజలకు, పార్టీ అధినేత,…
అసలే ఓరుగల్లు. అక్కడ అధికారపార్టీ నేతలంతా పోరుకు కాలుదువ్వేవాళ్లే. ఒకరిపొడ ఇంకొకరికి గిట్టదు. ఇందుకు పండగలను వాడేసుకున్నారు. మా తీరు ఇంతే అని ఇంకోసారి రుజువు చేశారు. పార్టీలో చర్చగా మారారు. వారెవరో.. ఏంటో ఇప్పుడు చూద్దాం. బతుకమ్మ, దసరా ఉత్సవాల్లోనూ ఆధిపత్యపోరే..! బతుకమ్మ, దసరా వేడుకల సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేతల మధ్య వర్గ విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ మాలోతు కవిత మధ్య.. వరంగల్‌లో ఎమ్మెల్యేలు,…
ముఖ్యమంత్రిగా ఉండే అర్హత కేసీఆర్‌కు లేదు.. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. హుజురాబాద్‌లో దళిత బంధు నిలుపుదలకు కేసీఆరే కారణం అన్నారు.. రెండు నెలలలోపు హుజురాబాద్ లో అందరికి “దళిత బంధు” ఇస్తా అని కేసీఆర్ మాట ఇచ్చారు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక దళిత బంధును బీజేపీ ఆపిందని నిందలు వేస్తున్నారని విమర్శించారు.. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వరదల్లో నష్టపోయిన వారికి…
హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ చేరిందా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. ఎన్నికల పోలింగ్ కు మరో పదిరోజుల సమయం ఉండగా ప్రచారం మాత్రం 72గంటల ముందే ముగించాలని ఈసీ ఆదేశించింది. అంటే ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజుల గడువు మాత్రమే ఉందనే స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీల అభ్యర్థులంతా హుజూరాబాద్ లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా సాగుతున్న ప్రచారంలోకి ఆయా పార్టీలకు చెందిన ముఖ్యనేతలు రంగంలోకి దిగుతున్నారు. దీంతో…
మరోసారి సవాళ్ల పర్వం తెరపైకి వచ్చింది.. తనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. తాను చెప్పే అంశాలపై కేటీఆర్ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.. కేటీఆర్‌తో చర్చకు తానే స్వయంగా వస్తానన్న రేవంత్… అయినా.. తమ పార్టీలో సీనియర్ల గురించి మాట్లాడేందుకు కేటీఆర్ ఎవరు? అని ప్రశ్నించారు. ఇక, తాము ఏదైనా అంటే కోర్టుకు పోతారని.. అయినా పిరికివాళ్ల గురించి ఏం మాట్లాడుతాం అంటూ రేవంత్ రెడ్డి…
యాదాద్రి: యాదగిరిగుట్టలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ .. హుజురాబాద్‌లో దళిత బంధును అడ్డుకునేది బీజేపీనే అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరని గెలిచేది టీఆర్‌ఎస్‌యే అని పేర్కొన్నారు. కావాలనే బీజేపీ దళిత బంధును అడ్డుకుందని తెలిపారు. బీజేపీ అండతో ఈటల ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది మాత్రం టీఆర్‌ఎస్ యే అన్నారు. రానున్న రోజుల్లో యావత్ దేశమే కేసీఆర్ బాటలో నడవనుందని…