టీఆర్ఎస్ పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజుల హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ప్లీనరీ సమావేశాలు నిర్వహించారు. అంతేకాకుండా టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. మహిళలను ఆకాశానికెత్తారు. మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ రాజ్యం బాగుంటుందన్నారు. మహిళల్లో ప్రతిభావంతులు ఉంటారని, మహిళలు అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని, మహిళలు ముందు వరుసలో నిలబడాలన్నారు. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీ నేతలకు చురకలు అంటిస్తూ.. సెల్ఫ్ డబ్బా కొట్టుకోలేదని, చేసిందే ఇక్కడ…
మెదక్ పార్లమెంట్ టీడీపీ కమిటీ సమావేశానికి హాజరైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కిన నరసింహులు అధికార టీఆర్‌ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తాన్నారు. కేసీఆర్ తెలంగాణ రాదనుకుని దళితుడిని సీఎం చేస్తానని అన్నారన్నారు. సీఎం ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటున్నాడని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారన్నారు. అంటరాని తనాన్ని రూపు మాపిన వ్యక్తి ఎన్టీఆర్ అని, త్వరలోనే టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని…
ములుగు జిల్లా టేకుల గూడ అడవి ప్రాంతంలో జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్ అని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ లేఖ ద్వారా పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులకు ఒక ద్రోహి సమాచారం ఇవ్వడం వలన ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని లేఖలో వివరించారు. పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని జగన్ లేఖలో వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సామాన్య ప్రజలను చంపడమే కాకుండా తన పాలన గొప్పగా ఉందని తెలపడం కోసం ప్లీనరీని నిర్వహించి, తమ…
సీఎం కేసీఆర్… మహానాయకుడు అంటూ తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు కొనియాడారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైనా కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి హరీశ్ రావు. ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం.. ఆ ఉద్యమాన్ని గమ్యస్థానానికి చేర్చడం.. ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనాయకుడు మన కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం పదవులను గడ్డి పోచలుగా త్యాగం చేసి టీఆర్ ఎస్ పార్టీని స్థాపించి తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టిన ఉద్యమ…
తెలంగాణలో ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న ఏకైక నియోజకవర్గం హుజూరాబాద్. గడిచిన ఐదు నెలలుగా ఈ నియోజకవర్గంలో ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గెలుపు ఎవరి పక్షాన నిలుస్తుందనేది ఉత్కంఠత నెలకొంది. దేశంలో అత్యంత క్లాస్టీ ఉప ఎన్నిక హుజూరాబాద్ నిలుస్తుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పలు రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా పారామిలిటరీ బలగాల విషయంలో హుజూరాబాద్ సరికొత్త రికార్డును క్రియేట్ చేయడం ఆసక్తిని రేపుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో మోహరించిన…
లక్ష రూపాయలు రుణమాఫీ చెయ్యకుండా నాన్చుతున్నరు. కేసీఆర్ హయాంలో పేదపిల్లలు చదువుకొనే 4 వేల స్కూల్స్ మూత బడ్డాయి అని విజయశాంతి అన్నారు. భూనిర్వాసితుల ఉసురుపోసుకున్నరు. డబుల్ బెడ్ రూంలు ఇవ్వలేదు. బతుకమ్మ చేరెలు కట్టుకొనెలా ఉన్నాయా అని ప్రశ్నించారు. దొరగారు వస్తె రోడ్డుపక్కన మా అక్క చెల్లెళ్ళు దండం పెడుతూ నిలబడలా. ఇదా ఆడవారికి మీరు ఇచ్చే గౌరవం దొరగారు. 7 ఏళ్లుగా 4 లక్షల కోట్లు అప్పు చేశారు. ఒక్క పథకం అమలు కాదు.…
జిల్లాలోని అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ పథకాల లెక్క తెలియదా? లబ్ధిదారుల వివరాలు తెలియకుండానే రాజకీయం చేస్తున్నారా? కొబ్బరికాయలు కొట్టడం.. రిబ్బన్ కటింగ్ చేయడంపై ఉన్న శ్రద్ధ పథకాల ప్రచారంలో చూపెట్టడం లేదా? ఈ అంశాలపైనే ఇప్పుడు పార్టీ పెద్దలు చురకలు వేశారా? ఇంతకీ ఏంటా జిల్లా? ఎవరా ప్రజాప్రతినిధి? కల్యాణలక్ష్మి లబ్ధిదారుల వివరాలు అడిగే సరికి నీళ్లు నమిలారట..! టీఆర్‌ఎస్ ప్లీనరీ.. విజయగర్జన సభ కోసం కొద్దిరోజులుగా నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ…
హుజురాబాద్ బైపోల్‌లో ప్రత్యర్థుల మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు మద్దతుగా ప్రచారంలో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యర్థి పార్టీల నాయకులపై తీవ్రమైన మాటల దాడి చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిజాం నవాబు… అధిపత్యం కోసం రజాకార్ల ను నియమించుకున్నారు . కేసీఆర్ నిజాం అయితే..ఖాసీం రిజ్వి హరీష్ రావు తన పెత్తనం నిలబెట్టుకోవడానికి నిజాం లాంటి కేసీఆర్…హరీష్ రావు ను…
ప్లీనరీ సమావేశాలకు ఏర్పాట్లు చేసుకుంటున్న టీఆర్‌ఎస్ పార్టీకీ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ షాక్ ఇచ్చారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత 15మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికతో టీఆర్‌ఎస్ పతనం మొదలైందని, చాలా మంది నేతలు టీఆర్‌ఎస్‌లో అసంతృప్తితో ఉన్నారన్నారు. తెలంగాణాలో కేసీఆర్ కుటుంబ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని, తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు తగిన బుద్ది చెబుతారన్నారు. గాంధీ భవన్‌లోకి గాడ్సే…