విభజన అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. అనంతర రంజిత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 23 అంశాలపై పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో చర్చించామని తెలిపారు. 23 అంశాలను పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు. ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ తమకు ఒక బుక్‌లెట్ అందించారని పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై ఇప్పటికే కేసీఆర్ కేంద్రానికి లేఖలు రాశారని గుర్తుచేశారు. బడ్జెట్ కూర్పు చూశాక రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం…
తెలంగాణ రాష్ట్ర సమితి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా వర్ధనపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆదివారం ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ.. పార్టీ పటిష్టతే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. అందరిని కలుపుకొని వెళ్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ అభివృద్ధికి తనవంతు సాయం అందిస్తానన్నారు. పార్టీలో ఎలాంటి సమస్యలు రాకుండా సమన్వయం చేసుకుంటూ…
కేంద్రంపై మరోసారి పోరాటానికి సిద్ధం అవుతోంది టీఆర్ఎస్ పార్టీ.. దానికి పార్లమెంట్ సమావేశాలను వేదికగా చేసుకోబోతోంది.. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ఇందులో భాగంగా ఇవాళ పార్టీ ఎంపీలకు కీలక సూచనలు, దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్.. పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ పార్లమెంటరీ…
ఈనెల 31 నుంచి పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి కరోనా నేపథ్యంలో రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలి దశ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరుగుతాయి. ఆ తర్వాత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశ సమావేశాలను నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో…
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో నాగారం మండలం, తిరుమలగిరి మండలంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటించారు. నాగారంలోని మండల కేంద్రంలో కడియం సోమక్క వెంకయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రఘునందర్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తుంగతుర్తి ప్రాంతంలోని తిరుమలగిరి ప్రాంతాన్ని దళితబంధుకు పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న ముఖ్యమంత్రి ఇంతవరకు ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం…
కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బదిలీలు అంటూ 317 జీవోను తీసుకువచ్చి ఉద్యోగులను ఆత్మహత్యలు చేసుకునేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఉద్యోగులతో చర్చించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, నెటివిటీ లేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అని పార్టీల నాయకులు చెప్పిన వినకుండా కేసీఆర్ మొండి వైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు. ఈ జీవోతో ఉద్యోగులు ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నర్సంపేట…
ఇటీవల ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీగా గెలిచిన తాతామధు గురువారం మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పార్టీలో ఉన్న చిన్న చిన్న గ్యాప్‌లను భర్తీ చేస్తానన్నారు. అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానని చెప్పారు. పార్టీలో నిర్మాణ పరమైన సమస్యలను పరిష్కారం చేసే దిశగా తన వంతు సాకారం అందిస్తానని వెల్లడించారు. తెలంగాణ సిద్ధాంతం ను, తెలంగాణ ఏర్పడడానికి గల కారణాలను ప్రజల వద్దకు తీసుకుని ముందుకు వెళ్తాం అన్నారు. పార్టీని ఒక్క…
జాతీయ పట్టణ ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో పట్టణీకీకరణ భారీ ఎత్తున పెరుగుతుందని, ఫలితంగా పట్టణ పేదరికం కూడా పెరిగే అవకాశం ఉందని మంత్రి అన్నారు. పట్టణాలకు వచ్చే పేద ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు కోసం వారి ఆదాయ మార్గాలు పెంచాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉందన్నారు. పట్టణ పేద ప్రజలు కనీస అవసరాలను అందుకునేలా వారి ఉపాధి హామీ ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని…
దాడులు చేసే సంస్కృతికి బీజేపీ వ్యతిరేకమని ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్ సభ్యుడు తన నియోజకవర్గంలో పర్యటిస్తే దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. దాడులకు బీజేపీ కార్యకర్తలు భయపడరన్నారు. రుణ మాఫీ ,డబల్ బెడ్ రూమ్ ,పెన్షన్ లాంటి పనులు సరిగా ఇవ్వని టీఆర్‌ఎస్ నాయకులపై ఇలానే దాడులు చేయమంటారా అంటూ ఫైర్ అయ్యారు. సిద్ధాంతం కోసం త్యాగాలు చేయడానికైనా కాషాయ కార్యకర్తలు వెనుకడారన్నారు.…
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ గుండా రాజకీయాలను ప్రోత్సహిస్తూ దాడులకు తెగబడుతుందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురువేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పై విమర్శల దాడులకు దిగారు. తెలంగాణలో రాజ్యాంగం అమలు కావడం లేదని.. భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా తెలంగాణలో పాలన సాగుతుందని విమర్శించారు. Read Also: నా ఎలక్షన్ అఫిడవిట్ పై అనవసర…