తెలంగాణలో వరి కొనుగోలుకి సంబంధించి బీజేపీ-టీఆర్ఎస్ మాటల యుద్ధం చేస్తున్నాయి. రెండుపార్టీల వైఖరిపై తెలంగాణ జనసమితి నేత ఫ్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ఇద్దరూ అలా గొడవపడితే ఎలా? పరిష్కారం చేయకుంటే తప్పుకోండి. కేంద్రం బాధ్యత నుంచి తప్పించుకోలేదు. కేంద్రం-రాష్ట్రం వివాదాల్లో గవర్నర్ కి టార్గెట్ చేశారు. గవర్నర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించింది. గవర్నర్ వ్యవస్థని అగౌరవపరిస్తే తమను తాము అవమానించుకోవడమే. రాజ్యాంగ వ్యవస్థ గౌరవం కాపాడాలి. గవర్నర్ బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల విషయంలో…
ఒకప్పుడు ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తెలంగాణ ఉద్యమంలో వారిద్దరీ ఒకటే మాట. ఒకటే బాట. కానీ తరవాత వాళ్ళిద్దరూ విడిపోయారు. ఆశించిన తెలంగాణ రాలేదని ఆచార్య కోదండరాం బయటకు వచ్చారు. కోదండరాం బాటే ఇప్పుడు వేరయింది. తెలంగాణ జనసమితి పేరుతో పార్టీ పెట్టారు. అయితే ఇటీవలి కాలంలో తెలంగాణ జనసమితిని వేరే పార్టీలో విలీనం చేస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అప్పుడు అందరినీ కలిసేలా చేశారు. ఇప్పుడు కేసీఆర్ కి వ్యతిరేకంగా అన్ని శక్తుల్ని ఏకం చేసే…