ఓవైపు ఢిల్లీ వేదికగా పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన జరగనుండా.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగ నిర్వహించేందుకు సిద్ధమైంది టీఆర్ఎస్ పార్టీ… హస్తినలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఇవాళ సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. హస్తినలో తెలంగాణ సీఎం కేసీఆర్ మూడురోజుల టూర్ బిజీబిజీగా సాగనుంది. మధ్యాహ్నం 1.48గంటలకు ఢిల్లీ వసంత్ విహార్‌లో.. టీఆర్‌ఎస్‌కు కేటాయించిన స్థలంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న మంత్రులు.. నిర్మాణ స్థలంలో భూమిపూజ ఏర్పాట్లను పరిశీలించారు. ఢిల్లీలోని…
మరోసారి హస్తినబాట పట్టనున్నారు తెలంగాణ సీఎం, గులాబీ పార్టీ బాస్ కేసీఆర్.. ఈ సారి మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీ పర్యటన కొనసాగనుంది.. కేసీఆర్ పర్యటనకు ఈసారి చాలా ప్రత్యేకత ఉంది.. ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించి.. జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని ఎప్పటి నుంచో భావిస్తున్న గులాబీ పార్టీ అధినేత.. హస్తినలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేయనున్నారు.. ఇక, ఈ మూడు రోజుల పర్యటనలో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే బస చేయనున్నారు.…