తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి కేంద్ర వైఖరిని టీఆర్‌ఎస్ తప్పుబడుతోంది. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. మొన్న అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టిన టీఆర్‌ఎస్. గురువారం రాష్ట్రంలో జాతీయ రహదారులను దిగ్భందించింది. తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. వడ్ల కొనుగోలు పై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ మంత్రి హరీష్ రావు…
బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్దం కొనసాగుతున్నట్టే.. మర్యాదల విషయంలోనూ అదే జరుగుతోంది. కేంద్రమంత్రి అశ్విని కుమార్ చౌబే తెలంగాణ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. రామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నాను. సమతామూర్తి కేంద్రం సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందన్నారు. నా శాఖల పౌర సరఫరాలు, పర్యావరణ శాఖలకు సంబంధించి రివ్యూ చేశానన్నారు. ఈ రివ్యూకి అధికారులు మాత్రమే వచ్చారు. రాష్ట్ర మంత్రులు ఎవరూ సమీక్షకు హాజరు కాలేదు. నావిషయంలో ప్రోటోకాల్ పాటించలేదు. అతిధి మర్యాద ఇవ్వలేదని విమర్శించారు.…
అయిననూ పోయిరావలె హస్తినకు అని.. ఢిల్లీ వెళ్లారు మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు. తిరిగొచ్చేశారు కూడా. మరి.. ధాన్యం సేకరణపై ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు? కేంద్రాన్ని దోషిగా నిలబెట్టేందుకు అధికారపార్టీకి ఈ టూర్ ఏ మేరకు ఉపయోగపడుతుంది? ఇండియా గేట్ దగ్గర ధాన్యం పారబోస్తామన్న మంత్రుల బృందం ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం దగ్గర తాడోపేడో తేల్చుకుంటాం.. చర్చలు జరిపి తీపి కబురుతో తిరిగొస్తాం అని ప్రకటించిన మంత్రులు, ఎంపీల బృందం హైదరాబాద్ చేరుకుంది. వారం రోజుల…
తెలంగాణ కాంగ్రెస్ వినూత్నంగా నిరసన తెలిపింది. వరి ధాన్యం విషయంలో ఢిల్లీతో తేల్చుకునే వస్తాం అని చెప్పిన మంత్రులు ఖాళీ చేతులతో రావడంతో కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. ఢిల్లీకి వెళ్ళిన మంత్రులు రాజీనామా చేయాలనీ డిమాండ్ చేసింది.ఢిల్లీ వెళ్ళి వచ్చిన మంత్రులకు చీరె, సారె పంపారు కాంగ్రెస్ మహిళా నేతలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో రాక్షస క్రీడ ఆడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవళి. పార్లమెంట్ సమావేశాల్లో పోరాడలేక టీ.ఆర్.ఎస్ ఎంపీలు చేతులెత్తేశారని,…
తెలంగాణలో వరిధాన్యం సమస్య వెనుక బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర వుందని మండిపడ్డారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణ మంత్రులు కొత్త డ్రామా ఆడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వైపు జనం చూస్తున్నారు కాబట్టి బీజేపీ-టీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయన్నారు. వరి ధాన్యం కొనుగోలు వెనుక బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ కుట్ర వుందని ఆరోపించారు జగ్గారెడ్డి. సీఎం కేసీఆర్ ఢిల్లీకి పోతేనే సమస్య పరిష్కారం కాలేదు. మంత్రులవల్ల ఏం అవుతుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రధాని…