అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన మునుగోడు ఉప పోరులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మునుగోడులో అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ తన సత్తా చాటుకుంది. టీఆర్ఎస్ నాయకులంతా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయానికి అవిరళ కృషిచేశారు. సరంపేటలో టీఆర్ఎస్ కు అత్యధిక మెజారిటీ లభించింది. సీఎం కేసీఆర్ ఇంఛార్జిగా ఉన్న మునుగోడు లోని సరంపేటలో టీఆర్ఎస్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
Read Also: TRS Mps On Munugode Bypoll: మునుగోడు ఓటర్లు కేసీఆర్ కు అండగా నిలిచారు
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో గజ్వేల్ నాయకులు ఇక్కడ ఎన్నిక ప్రచార బాధ్యతలు చూశారు. సరంపేటలో మొత్తం 1082 ఓట్లు ఉండగా 998 పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్ కు 666 ఓట్లు వచ్చాయి. BJP కి 209.. కాంగ్రెసుకు 43 ఓట్లు పడ్డాయి. 15 రౌండ్లలో కౌంటింగ్ జరగగా సరంపేట ఉన్న 12రౌండ్ లో TRS కు అత్యధికంగా 2 వేల మెజారిటీ వచ్చింది. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషి చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు,నాయకులకు,ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు ఉప ఎన్నికలో విజయంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయం సాధించడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. టీఆర్‌ఎస్ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగితేలాయి. నాయకులు, కార్యకర్తలు నృత్యాలు చేస్తూ, పటాకులు కాలుస్తూ, స్వీట్లు పంచిపెడుతూ సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సందడిగా మారింది.
Read Also: KA PAUL Live at Munugode: ఇళ్ళిళ్ళూ తిరుగుతూ ఓట్లు లెక్కిస్తున్న పాల్