తెలంగాణ రైతుల పక్షాన తాము పోరాడుతున్నామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సాంప్రదాయ పంటలను వదిలేసి ఆహార భద్రత కోసం ప్రభుత్వాలు చెప్పినందుకు రైతులు వరి పంటకు అలవాటు పడ్డారు. రైతులకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పుకుంటుందని మండిపడ్డారు. కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు 100 శాతం న్యాయం చేయలేవు. పంజాబ్ లో 100 శాతం కొంటున్న కేంద్రం ఇక్కడ మాత్రం వివక్ష చూపుతుందన్నారు జగదీష్ రెడ్డి. కేంద్రం ఎటువంటి…
తెలంగాణలో కరెంట్ ఛార్జీల పెంపుపై ఉద్యమానికి భారతీయ జనతాపార్టీ రెడీ అవుతోంది. ‘ప్రజా బ్యాలెట్’ పేరిట ప్రజాభిప్రాయ సేకరణకు రంగం సిద్ధం చేసింది బీజేపీ. బషీర్ బాగ్ లో రేపు ‘ప్రజా బ్యాలెట్’ ప్రారంభం కానుంది. గ్రామ పంచాయతీ సహా పట్టణాలు, నగరాలుసహా ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు సిద్ధమైంది బీజేపీ. ధర్నాలు, ఆందోళనలతో ఛార్జీల పెంపును ఉపసంహరించేదాకా టీఆర్ఎస్ పై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. 22 ఏళ్ల కిందట అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలను పెంచడాన్ని…
317 జీవోను సవరించాలంటూ ప్రగతి భవన్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న టీచర్లను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరెస్టు చేసిన టీచర్లందరిని ప్రభుత్వం భేషరుతుగా విడుదల చేయాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ‘స్థానికత’కు గొడ్డలిపెట్టుగా ఉన్న 317 జీవోను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. Read Also: గాలిపటం కోసం కరెంట్ పోల్ ఎక్కి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న బాలుడు 317 జీవోను…
సీఎం దత్తత గ్రామం ఎర్రవెల్లి లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, MLC జీవన్ రెడ్డి, MLA శ్రీధర్ బాబులతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులతో గృహనిర్బంధం చేయించిన కేసీఆర్ సర్కారు చర్యను తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్కతీవ్రంగా ఖండించారు. దేశంలో స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించిన రాజ్యాంగానికి విరుద్ధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ప్రతి…
నిన్న జరిగిన దౌర్జన్య కాండను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. రైతుల కోసం ఏ దాడులైనా భరిస్తాం. రైతుల పక్షాన పోరాడతాము అని బండి సంజయ్ అన్నారు. దాడుల్లో రైతులకే కొడుగుడ్లు తగిలాయి, రాళ్లు తగిలితే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. దాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను చెప్పుకునేందుకు వస్తుంటే టీఆరెస్ భయపడుతోంది. బాధలు చెప్పుకునేందుకు వచ్చే రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. బాధ్యత యుతంగా ఉండాల్సిన సీఎం కేసీఆర్ దాడులకు పిలుపునిస్తున్నారు. రైతుల ఇబ్బందులు ప్రశిస్తే…
తెలంగాణలో టీఆర్‌ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ సోయం బాపురావ్. ఆదిలాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్ ఓటమి తట్టుకోలేక వరి ధాన్యం పై రాద్దాంతం చేస్తున్నారని, కేంద్రం వరి ధాన్యం కొనము అని ఎక్కడా చెప్పలేదన్నారు. టీఆర్‌ఎస్ నేతలు బజార్ రౌడీల్లా మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ నాయకులు పరిధి దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీని బదనాం చేయడం కోసం తప్ప రైతులకు మేలు చేసే ఆలోచన టీఆర్ఎస్ కు లేదు. రైతుల మీద ప్రేమ…
ప్రభుత్వ విప్ ,అచ్ఛంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పై ఫైర్ అయ్యారు నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి లో ఆయమా మాట్లాడుతూ… తెరాస ఎమ్మెల్యే లు మంత్రులు రేవంత్ రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నాం. సీఎం కేసీఆర్ దళితులను మోసం చేశారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి ని దళిత మంత్రులు, దళిత ఎమ్మెల్యేలు ఎందుకు సీఎం ని…
సిఎం కెసిఆర్ పై వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులు చనిపోతే చలించని ఛాతీలో ఉంది గుండెనా బండరాయా? పాలకులకు చిత్తశుద్ధి ఉందా? ప్రజలు అందరూ చూడాలని పేర్కొన్నారు. నేను ఉద్యోగ దీక్ష ఎందుకు చేసానో అందరికి తెలుసని.. రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిపారు. ఉద్యోగాలు రాక ఆత్మాభిమానం చంపుకోలేక మానసికంగా రోజు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు చనిపోయేలా చేసింది కేసీఆర్ అని.. కేసీఆర్ ఒక మర్దరర్…