ప్రభుత్వ విప్ ,అచ్ఛంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పై ఫైర్ అయ్యారు నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి లో ఆయమా మాట్లాడుతూ… తెరాస ఎమ్మెల్యే లు మంత్రులు రేవంత్ రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నాం. సీఎం కేసీఆర్ దళితులను మోసం చేశారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి ని దళిత మంత్రులు, దళిత ఎమ్మెల్యేలు ఎందుకు సీఎం ని ప్రశ్నించడం లేదు. ముఖ్యమంత్రి అంటే మీకు భయమా. కాంగ్రెస్ పార్టీ హయం లో దళితులకు భూ పట్టాలు ఇస్తే వీటిని తెరాస గవర్నమెంట్ గుంజుకుంటున్నారు. తెరాస ప్రభుత్వం ఏర్పడినంక కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా,ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దళిత బంధు కి వ్యతిరేకం కాదు. కేవలం హుజారాబాద్ లో కాకుండా రాష్టం మొత్తం దళితబంధు ను ఇవ్వాలి అని తెలిపారు.
దళిత బందును కేవలం ఎన్నికల కోసం పెడతాం అంటే ఊరుకొం. తెరాస నాయకులు మతిస్థిమితం లేకుండా అధికారం భయం తో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. గువ్వల బాల్ రాజ్ ఒక రౌడీ లాగా వ్యవహరిస్తున్నాడు. అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. గువ్వల బాల్ రాజ్ గుంతల బాల్ రాజ్. గుప్తనిధుల బాల్ రాజ్. కాంగ్రేస్ పార్టీ దళితులకు భూ సంస్కరణలు చేసిన పార్టీ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని ఆంధ్రకు తరలిస్తే కమిషన్ లకు కక్కుర్తి పడి అడ్డుకోలేక పోతున్నావు. రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెరాస నాయకులు భేషరత్ గా బహిరంగ క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రి మెప్పు కోసం మాట్లాడే మాటలు తెరాస నాయకులు బంద్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. కేసీఆర్ రాజీనామా చేసి దళితుని ముఖ్యమంత్రి చేస్తే అప్పుడు కేసీఆర్ నిజాయితీ పరుడు అని నమ్ముతాం. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ కి స్వతంత్ర ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు.