తెలంగాణ ఇప్పుడు ప్రధానంగా సెప్టెంబర్ 17వ తేదీపై చర్చ సాగుతోంది.. విమోచనం అని ఒకరంటే.. విలీనమని మరొకరు.. ఇలా సెప్టెంబర్ 17పై రచ్చ సాగుతోంది.. అయితే.. . సాయుధ పోరాటంలో పాల్గొన్నది కాంగ్రెస్.. కమ్యూనిస్టులే… మిగతా వాళ్లు అప్పటికీ పుట్టనేలేదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… బీజేపీ, టీఆర్ఎస్ పుట్టకముందే పోరాటం చేసింది కాంగ్రెస్ అన్న ఆయన.. నిజాం రాజ్యం ఏలుతుంటే.. సైనిక చర్యతో స్వాతంత్య్రం ఇప్పించింది కాంగ్రెస్ అని.. ఇవి స్వాతంత్ర్య ఉత్సవాలు అన్నారు రేవంత్.. ఇక,…
టీఆర్ఎస్, బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. టీఆర్‌ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీకి పోవాలని టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతుందన్న ఆయన.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మళ్లీ అధికారంలోకి రావాలని టీఆర్‌ఎస్ కుట్ర రాజకీయం చేస్తుందని.. కాంగ్రెస్ అధికారంలోకి రావొద్దు అని టీఆర్‌ఎస్-బీజేపీ ప్లాన్ వేస్తున్నాయని మండిపడ్డారు.. ఇక, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు.. సీఎం కేసీఆర్ పరిపాలనలో విఫలం అయ్యారని విమర్శించారు జగ్గారెడ్డి.. అడిగారని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు..…
తెలంగాణ కాంగ్రెస్ వినూత్నంగా నిరసన తెలిపింది. వరి ధాన్యం విషయంలో ఢిల్లీతో తేల్చుకునే వస్తాం అని చెప్పిన మంత్రులు ఖాళీ చేతులతో రావడంతో కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. ఢిల్లీకి వెళ్ళిన మంత్రులు రాజీనామా చేయాలనీ డిమాండ్ చేసింది.ఢిల్లీ వెళ్ళి వచ్చిన మంత్రులకు చీరె, సారె పంపారు కాంగ్రెస్ మహిళా నేతలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో రాక్షస క్రీడ ఆడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవళి. పార్లమెంట్ సమావేశాల్లో పోరాడలేక టీ.ఆర్.ఎస్ ఎంపీలు చేతులెత్తేశారని,…
మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరి గ్రామంలో పర్యటించారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. తిరుమలగిరిలోని నిరుపేద సుజాతమ్మ ఇంటిని సందర్శించిన ఎమ్మెల్యే సీతక్క కేసీఆర్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. బిజేపి, టీఆర్‌ఎస్ రెండు ఒక్కటే, రాష్ట్రంలో కుస్తీ,ఢిల్లీలో దోస్తీ అన్నారు. ధర్నాచౌక్ తీసేసిన కేసిఆర్ కు ధర్నా చేసే హక్కులేదన్నారు. నిరుపేద సుజాతమ్మకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇల్లుకట్టించడం అభినందనీయం అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రికి కనీసం సోయిలేదు. పేదలు ఇండ్లులేక బాత్రూంలలో ఉంటే…
టీఆర్ఎస్, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. బండి మీద కారు ప్రయాణిస్తోందంటూ కామెంట్ చేసిన ఆయన.. బీజేపీ, టీఆర్ఎస్ కు అవగాహన ఉందన్నారు.. తెలంగాణ విమోచన దినోత్సవం జరపటం ఇద్దరకీ ఇష్టం లేదని.. ఈ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ కు నార్కోటిక్ టెస్ట్ చేయాలని వ్యాఖ్యానించారు. ఇక, తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవానికి బీజేపీ మతం రంగు పులుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణ.. విమోచన దినోత్సవం గురించి మాట్లాడే అర్హత కమ్యూనిస్టులకు మాత్రమే…