మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరి గ్రామంలో పర్యటించారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. తిరుమలగిరిలోని నిరుపేద సుజాతమ్మ ఇంటిని సందర్శించిన ఎమ్మెల్యే సీతక్క కేసీఆర్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. బిజేపి, టీఆర్‌ఎస్ రెండు ఒక్కటే, రాష్ట్రంలో కుస్తీ,ఢిల్లీలో దోస్తీ అన్నారు. ధర్నాచౌక్ తీసేసిన కేసిఆర్ కు ధర్నా చేసే హక్కులేదన్నారు.
నిరుపేద సుజాతమ్మకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇల్లుకట్టించడం అభినందనీయం అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రికి కనీసం సోయిలేదు. పేదలు ఇండ్లులేక బాత్రూంలలో ఉంటే ఇండ్లుకట్టించి ఇచ్చే దమ్ములేదా?తెలంగాణాలో వరి కొనుగోళ్ళ విషయంలో కేసిఆర్ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలను యుద్దప్రాతిపదికన పెంచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్స్,స్కూల్స్ సంఖ్య ఎందుకు పెంచడంలేదని సీతక్క ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను మద్యంమత్తులో ముంచి పబ్బం గడుపుకొంటుందన్నారు.