Chhindwara Navratri: దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ ఆలయాల్లో అమ్మవారు వివిధ అలంకరణలో దర్శనమిస్తున్నారు. దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఊరూరా ఏర్పాటుచేసిన మండపాల్లో నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. దసరా శరన్నవరాత్రి వేడుకలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తోంది. కాగా.. నవరాత్రుల పవిత్ర సందర్భంగా మధ్యప్రదేశ్ ఛింద్వారా జిల్లా జమునియా గ్రామంలో భక్తులు ఒకవైపు దుర్గామాత పూజల్లో మునిగితేలుతుండగా మరోవైపు గిరిజనులు రావణుడిని ఆరాధిస్తున్నారు. జమునియా గ్రామం నగరానికి కేవలం 16 కిలోమీటర్ల దూరంలోని…