ప్రత్యేక, హిందూ, విదేశీ వివాహ చట్టాల ప్రకారం స్వలింగ వివాహాలను గుర్తించాలని దాఖలైన పిటిషన్లపై విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. అయితే దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం కేంద్రం స్పందన కోరింది. ప్రధాన న్యాయమూర్తి డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై సూచనలను స్వీకరించడానికి, సమాధానం దాఖలు చేయడానికి కేంద్రం తరపు న్యాయవాదికి సమయం ఇచ్చింది. ఈ అంశాన్ని ఫిబ్రవరి 3న తదుపరి విచారణకు వాయిదా వేసింది.…
తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఉల్లంఘనలకు విధించిన చలాన్లు లేదా జరిమానాల ద్వారా రూ.366.08 కోట్ల రూపాయలను సేకరించినట్లు సమాచార హక్కు (ఆర్‌టీఐ) ద్వారా వెల్లడైంది. అయితే అమ్జాద్ ఖాన్ అనే వ్యక్తి పోలీసుల చలాన్ల ఆదాయంపై ఆర్‌టీఐలో దరఖాస్తు చేశాడు. ఈ నేపథ్యంలో అమ్జాద్ ఖాన్ కు పోలీసు శాఖ చలాన్లు, జరిమానాలకు సంబంధించిన వివరాలను అందజేసింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ఏప్రిల్ 1, 2020 నుండి సెప్టెంబర్…
తెలుగు చిత్రసీమలో వెలసిన పాటలతోటలో ఎన్నెన్నో తేనెల వానలు కురిశాయి. అన్నీ తెలుగువారికి పరమానందం పంచాయి. ఈ తోటపై ‘సిరివెన్నెల’ కురిపించిన ఘనత మాత్రం సీతారామశాస్త్రిదే అని అందరూ అంగీకరిస్తారు. సీతారామశాస్త్రి పాటల్లోని పదబంధాలకు తెలుగు జనం ఆరంభంలోనే బందీలయిపోయారు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా వందల పాటల్లో సిరివెన్నెల కురుస్తూనే ఉంది. నింగిలోని చంద్రుడు కురిపించే వెన్నెల ప్రపంచానికంతా పరిచయమే, నేలపైని చెంబోలు సీతారాముడు కురిపించే సిరివెన్నెల మాత్రం తెలుగువారికి మాత్రమే సొంతం. ఒకటా రెండా…
తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో అద్భుతమైన పాటలను అందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ నెల 24 అస్వస్థతతో కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన న్యూమోనియాతో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. అంతేకాకుండా ఆయనను నిపుణులైన వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అయితే తాజాగా సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులకు వైద్యులు వెల్లడిస్తున్నట్లు సమాచారం. ఆయన త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు. Also Read :…
కరోనా మహమ్మరి దేశంలో ఇంకా ప్రబలుతూనే ఉంది. కొన్ని చోట్ల తగ్గుముఖం పట్టినా కరోనా వైరస్ మరికొన్ని చోట్ల విజృంభిస్తోంది. అయితే ఇండియా ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో అతలాకుతలమైంది. అయితే థర్డ్ వేవ్‌కు భారతదేశంలో అస్కారం లేకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలు విధించాయి. గత నెల కేంద్రం పొడగించిన కోవిడ్ నిబంధనలు నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి కేంద్రం కోవిడ్ నిబంధనలను డిసెంబర్ 31వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే…
ప్రపంచ దేశాల గడగడలాడించిన కరోనా వైరస్ మరో రూపం ఎత్తి భయాందోళనకు గురి చేస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై పలు దేశాలు ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే మొన్నటి వరకు కరోనా డెల్టా వేరియంట్ తోనే అవస్థలు పడిన తెలంగాణ ప్రజలు ఇప్పడు మరో వేరియంట్ వ్యాప్తి చెందుతోంది అనే సరికి భయం మొదలైంది. అయితే దీనిపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. విదేశాల నుంచి 41 మంది…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క ల పెయిర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ రియల్ కపుల్స్ ని గుర్తుచేస్తూ ఉంటుంది. ‘మిర్చి’, ‘బిల్లా’, ‘బాహుబలి’ చిత్రాల్లో వారిద్దరి రొమాన్స్ చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. ఇక ఈ జంట బయట కూడా ప్రేమికులే అన్న వార్తలు ఇప్పటికి అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. కానీ, మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహ బంధమేననీ స్వీటీ, ప్రభాస్ తేల్చి…
భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుపతిలో కూడా మునుపెన్నడూ చూడనటువంటి వరదలు తలెత్తాయి. వరద ప్రభావిత ప్రాంతాలపై ఇప్పటికే ఆరా తీసిన సీఎం జగన్ ఈనెల 2న స్వయంగా తానే జనం దగ్గరకు వెళ్లనున్నారు. నేరుగా వరద బాధితులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇప్పటికే పంట, ప్రాణ నష్టం పై వివరాలను జగన్ తీసుకున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని…
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని కేసీఆర్ ఎండగట్టారు. కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. 700 మందిని పొట్టనపెట్టుకున్న హంతక పార్టీ బీజేపీ అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్రాన్ని ఒప్పించే దమ్ములేక తెలంగాణ బీజేపీ నేతలు నాటకాలు ఆడుతున్నారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి సిపాయిలా పోరాడి కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయించాలంటూ సవాల్ విసిరారు. బీజేపీ హయాంలో అన్నపురాశులు ఒకవైపు.. ఆకలి కేకలు ఇంకోవైపుగా పరిస్థితి ఉందని ఆయన…
ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సోమవారం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం తన సామాజిక బాధ్యతను విస్మరించిందని అన్నారు. రైతు, పేదల వ్యతిరేక విధానాలను కేంద్రం అవలంభిస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా దేశ ఆహార భద్రత కోసం బఫర్ స్టాక్స్ పెడుతుందని, రాజ్యాంగం ప్రకారం కేంద్రంపై బాధ్యత ఉందన్నారు. కోట్ల మంది బాధ్యతలను చూసే కేంద్రం చిల్లర కొట్టు యజమానిలా వ్యవహరించకూడదని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం దేశ రైతుల్నే గందరగోళంలోకి…