ఆ పిటిషన్లపై విచారణ ప్రత్యక్ష ప్రసారం చేయండి : ఢిల్లీ హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రత్యేక, హిందూ, విదేశీ వివాహ చట్టాల ప్రకారం స్వలింగ వివాహాలను గుర్తించాలని దాఖలైన పిటిషన్లపై విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. అయితే దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం కేంద్రం స్పందన కోరింది. ప్రధాన న్యాయమూర్తి డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై సూచనలను స్వీకరించడానికి, సమాధానం దాఖలు చేయడానికి కేంద్రం తరపు న్యాయవాదికి సమయం ఇచ్చింది.
ఈ అంశాన్ని ఫిబ్రవరి 3న తదుపరి విచారణకు వాయిదా వేసింది. ప్రత్యేక, హిందూ, విదేశీ వివాహ చట్టాల ప్రకారం స్వలింగ వివాహాలను గుర్తిస్తూ డిక్లరేషన్ ఇవ్వాలని కోరుతూ పలువురు స్వలింగ జంటలు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. కొంతమంది పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ దేశంలోని మొత్తం జనాభాలో ఏడెనిమిది శాతానికి సంబంధించిన హక్కుల దృష్ట్యా, ప్రొసిడింగ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయడం తప్పనిసరి అని సమర్పించారు.
Also Read
- Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
- Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
- Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
- Koti Deepotsavam Day-12: కోటి దీపోత్సవంలో రామేశ్వర వైభవం.. నేడు రామనాథస్వామి కల్యాణం.!
Read Also : వామ్మో.. తెలంగాణలో ఇన్ని కోట్ల పోలీస్ చలాన్లా..
ఇది జాతీయ, రాజ్యాంగపరమైన ప్రాముఖ్యత కలిగిన విషయమని ఆయన ధర్మాసనానికి వివరించారు. ప్రత్యక్ష ప్రసారం అధిక జనాభాకు ఆతిథ్యం ఇవ్వగలదని ఆయన పేర్కొన్నారు. కౌల్ తన క్లయింట్లు ఈ కేసుల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎంతో మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, పెద్ద సంఖ్యలో ప్రజలు విచారణకు హాజరు కావాలనుకున్నప్పటికీ, సాంకేతిక ప్లాట్‌ఫారమ్‌ల పరిమితి కారణంగా వారు అలా చేయలేకపోతున్నారని ఆయన వెల్లడించారు. సుప్రీంకోర్టు, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, బార్ జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అనుకూలంగా ఉన్నాయని, ఈ పిటిషన్లు ఈ కోవలోకే వస్తాయని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
-
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
-
BCCI: సిరాజ్‌ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!