కరోనా మహమ్మరి దేశంలో ఇంకా ప్రబలుతూనే ఉంది. కొన్ని చోట్ల తగ్గుముఖం పట్టినా కరోనా వైరస్ మరికొన్ని చోట్ల విజృంభిస్తోంది. అయితే ఇండియా ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో అతలాకుతలమైంది. అయితే థర్డ్ వేవ్‌కు భారతదేశంలో అస్కారం లేకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలు విధించాయి. గత నెల కేంద్రం పొడగించిన కోవిడ్ నిబంధనలు నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి కేంద్రం కోవిడ్ నిబంధనలను డిసెంబర్ 31వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించింది.
ఇదిలా ఉంటే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో పుట్టి పలు దేశాలకు వ్యాప్తి చెందింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై సమీక్ష నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వాలు ఒమిక్రాన్‌పై ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో ఒమిక్రాన్‌పై సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఒమిక్రాన్ వచ్చిన ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే తెలంగాణ వైద్యాధికారులు వెల్లడించారు.