ప్రపంచ దేశాల గడగడలాడించిన కరోనా వైరస్ మరో రూపం ఎత్తి భయాందోళనకు గురి చేస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై పలు దేశాలు ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే మొన్నటి వరకు కరోనా డెల్టా వేరియంట్ తోనే అవస్థలు పడిన తెలంగాణ ప్రజలు ఇప్పడు మరో వేరియంట్ వ్యాప్తి చెందుతోంది అనే సరికి భయం మొదలైంది. అయితే దీనిపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు.
విదేశాల నుంచి 41 మంది తెలంగాణకు వచ్చినట్లు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రేస్ చేసి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించామని.. కానీ ఎవ్వరికీ కరోనా సోకలేదని ఆయన తెలిపారు. కొత్త వేరియంట్ 6 రెట్లు సోకే ప్రమాదముంటున్నారని.. వైరస్ మ్యుటేషన్లు సహజం అన్నారు. కొత్త వేరియంట్ వచ్చి 7 రోజులు మాత్రమే అవుతోందని, 14 రోజుల తరువాత పూర్తి స్థాయి లక్షణాలు తెలిసే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త వేరియంట్ వల్ల ఒళ్లునొప్పి, తలనొప్పి లక్షణాలు ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ట్రీట్‌మెంట్, ప్రోటోకాల్‌లో తేడా లేదని ఆయన స్పష్టం చేశారు.