మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్లానింగ్ గురించి తెలియని వారు లేరు. ఆయన ప్లాన్ వేస్తే ఇక తిరుగుండదు. చిరంజీవిని మెగాస్టార్ కావటం వెనుక అరవింద్ బుర్రకే అగ్రతాంబూలం ఇవ్వాలి. ఇక కాలానికంటే ముందు పరిగెత్తే బుర్ర అరవింద్ ది. సినిమాలు, రిలీజ్ లు, సక్సెస్ లు ఆ బుర్ర నుంచి కుప్పలు తెప్పలు గా వచ్చాయి. తాజాగా ఆయన బ్రెయిన్ నుంచి వచ్చిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ తెలుగునాట అగ్రస్థానంలో నిలవటంలో ఆయన చిన్ని…
అసలు నందమూరి, మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతోంది ?… ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మధ్య ఇదే ప్రశ్న మెదులుతోంది. గతంలో నందమూరి, మెగా ఫ్యామిలీలు పెద్దగా కలిసిన సందర్భాలు లేవు. ముఖ్యంగా సినిమా ఈవెంట్లలో… అందుకే ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న పరిణాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బాలయ్య వేడుకకు అతిథిగా మెగా హీరో !నటసింహం నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ”. ఇక ఇందులో బాలయ్య అఘోరా…
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి పండుగ మళ్లీ మొదలైంది. అదేంటి అనుకుంటున్నారా.. అవునండి మొన్నటి వరకు భారీ వర్షాలతో గంజాయి రవాణా ముఠాకు అడ్డంకి వచ్చిపడింది. ఇప్పుడు కొంచెం వరుణుడు విరామం తీసుకుందామని తెలుగు రాష్ట్రాలకు సెలవు ప్రకటించాడో లేదో.. మళ్లీ గంజాయి ముఠాలు రెచ్చిపోతున్నాయి. అయితే వారు రెచ్చిపోతే మేము తగ్గేదేలే అంటున్నారు పోలీసులు. తాజాగా హైదరాబాద్‌లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు…
హైదరాబాద్ కు చెందిన యువతి శ్రీశైలంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన అభిలాష్‌రెడ్డి, మౌనిక భార్యభర్తలు. వీరిద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే. అయితే వివాహం జరిగినప్పటి నుంచి భర్త అభిలాష్‌రెడ్డి భార్య మౌనికను అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించేవాడు. దీంతో విసుగుచెందిన మౌనిక భర్త అభిలాష్‌పై రెండు నెలల క్రితం సరూర్ నగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సరూర్ నగర్ మహిళ పోలీస్…
గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుంచి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తెగ ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. మేఘాలయ కాంగ్రెస్‌లో చీలికలు మొదలయ్యాయి. మేఘాలయలో మొత్తం 60 సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులు 21 స్థానాల్లో గెలుపొందారు. అయితే కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న మేఘాలయ మాజీ సీఎం ముకుల్ సంగ్మా తన అనచరులు 12 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాకుండా టీఎంసీ పార్టీలో చేరుతున్నట్లు స్పీకర్‌కు లేఖ రాసినట్లు ఆయన…
పండగలతో నిమిత్తం లేకుండా మనదేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో బంగారం కొనాలని భావిస్తున్న వారికి గుడ్‌న్యూస్. దేశంలో మంగళవారం రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో విలువైన లోహాల ధరలు పతనం కావడంతో దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం రాత్రికి రాత్రే 10 గ్రాముల బంగారం ధర రూ.810 తగ్గి రూ.46,896కు చేరింది. కేవలం వారం రోజుల్లోనే పసిడి ధర రూ.2 వేల వరకు తగ్గింది. Read Also:…
మామూలుగా అఘోరా అంటేనే ఆశ్చర్యం, ఒక్కింత భయం కలగడం సహజం. దానికి కారణం అఘోరాల విధివిధానాలే. అఘోరాల్లో కొందరు నగ్నంగా, చిన్న గుడ్డకట్టుకొని కనిపించడమే కాకుండా వారి రూపం కూడా భయాందోళనకు గురి చేస్తుంటుంది. అంతేకాకుండా ఈ అఘోరాలు కాలిన బూడిదను విభూతిగా పరిగణించి ఒళ్లంతా రాసుకోవడం, మానవ మృతదేహాలను తినడం లాంటి విపరీత చర్యలు చూసి ఒక్కింత భయం కలుగుతుంది. అయితే తాజాగా ఓ అఘోరా తన శిష్యురాలిగా ఉన్న అఘోరీని పెళ్లి చేసుకున్నాడు. తమిళనాడుకు…
అమరావతి రైతులు, ఏపీకి ఒకే రాజధానికి మద్దతిస్తున్న వారికి జగన్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మూడు రాజధానులపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉప సంహరించుకున్నట్లు అడ్వకేట్ జనరల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటామని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. Also Read : కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్లు…
రోడ్డు ప్రమాదాలకు, అనారోగ్యాలకు కారణమయిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణిస్తారు. కొందరు కోమాలో వుంటారు. ఆయా రోగుల పరిస్థితిని బట్టి డాక్టర్లు వైద్యం అందిస్తారు. డెత్ సర్టిఫికెట్ ఇచ్చారంటే…ఇక ఆ వ్యక్తి చనిపోయినట్టే లెక్క. కానీ యూపీలో ఓ వ్యక్తి చనిపోయినట్టుగా డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారు. తీరా ఆ వ్యక్తి పోస్ట్ మార్టం చేద్దామని ప్రయత్నిస్తే సదరు వ్యక్తి బతికే వున్నట్టు తేలింది. యూపీకి చెందిన 45 ఏళ్ళ శ్రీకేష్ కుమార్ మొరాదాబాద్ లో మోటార్…