వామ్మో.. తెలంగాణలో ఇన్ని కోట్ల పోలీస్ చలాన్లా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఉల్లంఘనలకు విధించిన చలాన్లు లేదా జరిమానాల ద్వారా రూ.366.08 కోట్ల రూపాయలను సేకరించినట్లు సమాచార హక్కు (ఆర్టీఐ) ద్వారా వెల్లడైంది. అయితే అమ్జాద్ ఖాన్ అనే వ్యక్తి పోలీసుల చలాన్ల ఆదాయంపై ఆర్టీఐలో దరఖాస్తు చేశాడు. ఈ నేపథ్యంలో అమ్జాద్ ఖాన్ కు పోలీసు శాఖ చలాన్లు, జరిమానాలకు సంబంధించిన వివరాలను అందజేసింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ఏప్రిల్ 1, 2020 నుండి సెప్టెంబర్ 30, 2021 మధ్య ఈ మొత్తాన్ని సేకరించినట్లు వెల్లడించారు.
అయితే ఏప్రిల్ 2020 నుండి మార్చి 2021 మధ్య పోలీసు శాఖ రూ. 208 కోట్ల జరిమానాలను వసూలు చేసింది. అంతేకాకుండా ఏప్రిల్ 2021 నుండి సెప్టెంబర్ 2021 మధ్య రూ.158.33 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఇదే సమయంలో సైబరాబాద్ పోలీసు పరిధిలో అత్యధికంగా రూ.53.26 కోట్లు చలాన్లు వసూలు చేసి మొదటిస్థానంలో ఉంది. అదేవిధంగా ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రూ.35 కోట్ల జరిమానా వసూలు చేసి రెండో స్థానంలో నిలిచారు. ట్రాఫిక్ పోలీసులకు అత్యల్పంగా జిల్లా జయశంకర్ భూపాలపల్లి నుంచి రూ.30.36 కోట్లు లభించింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్, హైదరాబాద్‌లలో ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు భారీగా చలాన్లు విధిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read

తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
RC 17 షురూ.. చిరంజీవి చేతుల మీదుగా చరణ్ కొత్త సినిమా ప్రారంభం!
-
CM Chandrababu: గతంలో ఎన్నడూ లేనంతటి స్ఫూర్తి కనిపిస్తోంది.. స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్..
-
Punjab: పంజాబ్ ఆప్‌లో అసంతృప్తి సెగ.. పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా!
-
Ind vs NZ: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఇషాన్, శ్రేయస్ అయ్యర్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..
-
AP Cyclone Alert: ఏపీకి మరో తుపాను ముప్పు.. 3-4 రోజులు అతి భారీ వర్షాలు!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!