ప్రముఖ గేయ రచయిత పద్మశ్రీ సిరివెన్నెల మరణంతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ఈ నెల 24న కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే అప్పటి నుండి నిపుణుల వైద్య బృందం చికిత్స చేశారు. ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సాయంత్రం కన్నుమూశారు.
సిరివెన్నెల మృతిపై రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సిరివెన్నెల మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ… సిరివెన్నెల సీతారామశాస్త్రి నడిచే నక్షత్రంలా స్వర్గద్వారాలవైపు సాగిపోయారు.. మనకి ఆయన సాహిత్యాన్ని కానుకగా ఇచ్చి వెళ్లారు.. మిత్రమా.. విల్ మిస్ యూ ఫరేవర్ అంటూ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.
'సిరివెన్నెల' మనకిక లేదు. సాహిత్యానికి ఇది చీకటి రోజు pic.twitter.com/dcRFE4XPXn
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 30, 2021
నడిచి వచ్చే నక్షత్రంలా ఆయన స్వర్గద్వారాల వైపు సాగిపోయారు. మనకి ఆయన సాహిత్యాన్ని కానుకగా ఇచ్చి వెళ్లారు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 30, 2021
మిత్రమా … will miss you FOREVER !#SiriVennela #SirivennelaSeetharamaSastry pic.twitter.com/HJKsBNvQ4J