రోజూ నాలుగు షోలకు మించకూడదు, బెని ఫిట్ షోస్ అసలు వేయకూడదని ఏపీ సర్కార్ చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు విడుదలైన బాలకృష్ణ ‘అఖండ’ సినిమాను రెండు సినిమా థియేటర్లలో బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. దీంతో అధికారులు ఆ థియేటర్లను సీజ్ చేశారు. చట్ట సవరణ తర్వాత నిబంధనలు ఉల్లంఘించి థియేటర్స్ పై మొదటిసారి సర్కార్ యాక్షన్ తీసుకుంది. కృష్ణా జిల్లా మైలవరంలోని సంఘమిత్ర మిని ధియేటర్ అఖండ సినిమా ఉదయం…
యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టతనివ్వకపోవడంతో రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంభించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ రోజు సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో వివిధ రకాల పంటలను పరిశీలించారు. అంతేకాకుండా అక్కడి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ.. వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు సాగు చేయాలన్నారు. వరిలాంటి ఒకే రకం పంట వేసి ఇబ్బంది పడొద్దని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని ఆయన…
కరోనా మహమ్మారి జర్మనీలో విజృంభిస్తోంది. ఇప్పటికే జర్మనీలో కోవిడ్ తీవ్ర రూపం దాల్చింది. దీంతో రోజుకు 76 వేల పై చిలుకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ జర్మనీలో ప్రవేశించింది కూడా. దీంతో ప్రజల్లో మరింత భయం నెలకొంది. తాజా కేసులతో అక్కడి ఆసుపత్రులన్ని కిక్కిరిసిపోవడంతో ఏకంగా వైమానిక దళాన్ని కూడా జర్మనీ ప్రభుత్వం రంగంలోకి దింపింది. అంతేకాకుండా కరోనా కట్టడికి షరతులతో కూడిన లాక్‌డౌన్‌ను కూడా విధిస్తున్నట్లు…
ఉత్తరాంధ్ర, ఒడిషాల వైపు జవాద్ తీవ్ర తుఫాన్ ముప్పు ముంచుకు వస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ రోజు అర్ధరాత్రి వాయుగుండం ఏర్పడనుంది. ఆ తర్వాత 24గంటల్లో తుఫాన్ గాను అనంతరం తీవ్ర తుఫాన్ గాను మారుతుంది. ఇప్పటికి ఉన్న అంచనా ప్రకారం ఈ తుఫాన్ ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులతో ప్రయాణిస్తుంది. దీని ప్రభావం వల్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోని పర్యాటక ప్రదేశాలు 3రోజుల…
ప్రపంచ దేశాలతోపాటు అగ్రరాజ్యమైన అమెరికాను సైతం గడగడలాడించింది కరోనా మహమ్మారి. కరోనా ధాటికి ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. కరోనా సోకి ఇంటి పెద్దలు మృతి చెందడంతో చాలా మంది చిన్నారులు అనాథలు మారారు. కరోనా రూపాంతరం చెంది డెల్టా వేరియంట్‌గా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో కరోనాను ఎదుర్కునేందుకు ఎంతో శ్రమించి శాస్త్రవేత్తలు కోవిడ్ వ్యాక్సిన్లను కనుగొన్నారు. అయితే కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నమ్మి ప్రజలు వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.…
యావత్తు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన కరోనా మహమ్మరి రూపాంతరం చెంది మరోసారి విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు పలు దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. నేడు ఇండియాలో కూడా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం గమనార్హం. అయితే తాజాగా ఒమిక్రాన్‌పై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఓ) పలు సూచనలు చేసింది. దక్షిణాఫ్రికాలోని యువత తీవ్ర లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారని వెల్లడించింది. కరోనా వేరియంట్లతో పొల్చితే…
తవ్వకాల్లో బయటపడిన వస్తువులపై అందరికీ ఆసక్తి ఉంటుంది. అలాగే అవి ఎక్కడ బయటపడ్డాయని తెలుసుకునేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే తాజాగా పురాతన నాణేలతో నిండిన కుండ ఒకటి బయట పడింది. ఎక్కడంటే మధ్య ప్రదేశ్‌లోని టికామ్‌ఘర్ జిల్లాలో. అయితే టికామ్‌ఘర్ పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో గల నందన్‌వారా గ్రామంలోని మట్టి క్వారీలో మంగళవారం ఉదయం జేసీబీతో మట్టిని తవ్వుతున్న సమయంలో ఒక కుండ కార్మికులకు కనిపించింది. దీంతో కార్మికులు ఆ కుండను బయటకు తీశారు. అందులో…
ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించిన 3 రాజధానుల బిల్లు గత అసెంబ్లీ సమావేశాలలో రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై సీఎం జగన్ మాట్లాడుతూ.. 3 రాజధానుల నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోలేదని, కొన్ని సవరణలతో మళ్లీ బిల్లును ప్రవేశపెడుతామని అప్పుడే చెప్పారు. దీంతో 3 రాజధానుల బిల్లు రద్దు చేస్తారనుకున్న వారితో మళ్లీ ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మళ్లీ 3 రాజధానుల వచ్చే బడ్జెట్ సమావేశాల్లో…
ప్రస్తుతం టాలీవుడ్ లో శిల్పా చౌదరి చీటింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. అధిక వడ్డీ పేరు చెప్పి ప్రముఖుల వద్ద నుంచి కోట్లు కాజేసిన శిల్పా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఇటీవల ఆమె టాలీవుడ్ లోని ముగ్గురు సెలబ్రెటీలను మోసం చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె అరెస్ట్ అయ్యాకా ఆ ముగ్గురు సెలబ్రెటీలు ఎవరు అనేది అందరిని తొలుస్తున్న ప్రశ్న. ఇక ఈ నేపథ్యంలోనే శిల్ప బాధితుల్లో చాలామంది…
మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతోనే ఏపీ అతలాకుతలమైంది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది ఏపీ ప్రభుత్వం. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో తుఫాన్ ఏపీపై విరుచుకుపడేందుకు సిద్ధమవుతోంది. తాజాగా వాతావరణ శాఖ వెల్లడించిన ఫలితాల ప్రకారం.. గత నెల 29న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఇప్పుడు వాయుగుండంగా బలపడి ఎల్లుండి తుఫాన్ గా మారే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఏపీ, ఒడిశాలో 4న ఉదయం తీరం దాటుతుందని అంచనా వేస్తున్నట్లు వాతావరణ…