కరోనా మహమ్మారి రోజురోజు కొత్తగా రూపాంతరాలు చెందుతూ ప్రజలపై విరుచుకుపడుతోంది. గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు, దాని నివారణకై శాస్త్రవేత్తలు ఇప్పటికే తలలు బద్దలు కొట్టుకుంటుంటే ఇప్పుడు మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్రానికి దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు ఆరోగ్య అధికారులు బుధవారం…
ఐటీ కారిడార్‌లో ప్రభుత్వ వైద్యసేవలను విస్తృతం చేయడంలో భాగంగా కొండాపూర్‌లోని జిల్లా ఆస్పత్రిలో 100 పడకలతో ఏర్పాటు చేసిన మూడో అంతస్తును వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి. హరీశ్‌రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ , ఆర్‌ఈఐటీ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్), కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్)ల చొరవతో 100 పడకల సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్‌ను…
జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తిలో మంగళవారం మధ్యాహ్నం ఓ రైతు తన వ్యవసాయ పొలంలో సజీవ దహనమైన ఘటన చోటు చేసుకుంది. పొలంలో కాలిపోయిన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించడంతో అర్థరాత్రి ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతుగంటి లక్ష్మణ్ గౌడ్ (54) మంగళవారం మధ్యాహ్నం తన వ్యవసాయ పొలంలో వరి చెత్తకు నిప్పంటించగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. కంటిచూపు సమస్య ఉన్న లక్ష్మణ్ గౌడ్ మంటలను గమనించలేకపోయాడు. అతడిని రక్షించేందుకు చుట్టుపక్కల…
కరోనా రక్కసి కోరల్లో చిక్కుకొని ఫ్రాన్స్ విలవిలలాడుతోంది. ఇప్పటికే డెల్టా వేరియంట్‌తో దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు కరోనా నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తున్నా కరోనా విజృంభనమాత్రం తగ్గడం లేదు. దీనికి తోడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సంఖ్య కూడా ఆదేశాన్ని కలవరడపెడుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఆసుపత్రులు పూర్తి స్థాయిలో వినియోగించినా సరిపోవని ఫ్రాన్స్ వైద్య నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో విధించే ‘కోడ్ వైట్’ అలర్ట్‌ను…
మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాల గనుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ గనుల్లో పనిచేసే కూలీలు రాత్రికి రాత్రే లక్షాధికారులవడం మామూలే. అయితే తాజాగా మరో కూలీని అదృష్టం వరించింది. దీంతో ఆ కూలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గిరిజన కూలీ అయిన ములాయం సింగ్‌కు జీవితం రోజువారీ పోరాటం. తన పిల్లలను చదివించుకోవటం, ఇళ్లు గడపడం చాలా కష్టంగా మారింది. అయితే, మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పన్నా వజ్రాల గనుల్లోని నిస్సార…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచ దేశాల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. గత రెండు కరోనా వేవ్‌లతోనే ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో మరోసారి కరోనా రక్కసి విజృంభించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వివిధ దేశాలకు పాకిన ఈ వేరియంట్ భారత్‌లోకి కూడా ఎంటరైంది. ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు భారత్‌లో పెరుగుతున్నాయి. అంతేకాకుండా మునిపటికంటే ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య…
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలల్లో గంప గోవర్థన్ రూటే సపరేటుగా ఉంటుంది. ఆయన దేనిపైన స్పందించినా తన దైనతీరుతో వెళ్తుంటారు. తాజాగా ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే అయిన గంప గోవర్థన్ కలెక్టరేట్ కి రైతులతో పాటు ధాన్యంలోడ్‌తో ఉన్న లారీ తీసుకువచ్చారు. 3వ తేదీ నుండి రైతులను రైస్ మిల్ యజమానులు ఇబ్బంది పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తి చేశారు. జిల్లా లో కొందరు రైస్ మిల్స్ యజమానులు రైతులను ఇబ్బంది పెడుతున్నారని, జిల్లాలో మిగిలిన 20 శాతం ధాన్యం…
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై అసైన్డ్ భూముల అక్రమణ కేసుపై ఈటల జమున మీడియా మాట్లాడారు. చట్టపరంగానే భూములు కొన్నామని ఈటల జమున వివరించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఈటల జమున మాటలపై స్పందిస్తూ.. సర్వే నంబర్ 130 లో పట్టా ల్యాండ్ లేదని వెల్లడించారు. ఈటల జామున కొనుగోలు చేసిన 3 ఎకరాలు చట్ట విరుద్ధమైన పత్రమని ఆయన అన్నారు. అంతేకాకుండా ఆ భూమి పై ఎలాంటి హక్కు లేని రామరావు దగ్గర నుండి…
ఖమ్మం ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తాతా మధుకు సంబంధించిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు అందరినీ గోవా క్యాంప్ కు తరలించారు. గత వారం రోజులుగా 470 మంది ఓటర్లు వారితోపాటు వారి బంధువులు అంతా గోవాలో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. గోవాలో డ్యాన్సులతో మారుమోగుతున్న వీడియోలను ఎప్పటికప్పుడు ఎన్టీవీ అందించింది. అయితే ఈ నెల పదో తారీఖున ఓటింగ్ ఉండటంతో అక్కడ ఉన్న ఓటర్లను ముందుగా హైదరాబాద్ కి తరలిస్తున్నారు. ప్రస్తుతతం గోవాలో ఉన్న ఓటర్లు…