ఇప్పటికే ప్రపంచ దేశాలు కరోనా డెల్టా వేరియంట్‌తో సతమతమవుతున్న వేళ దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ మరోసారి యావత్తు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే తాజాగా ఒమిక్రాన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ పలు విషయాలు వెల్లడించారు.
ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆయన తెలిపారు. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకుని కోవిడ్ బారినపడి కోలుకున్న వ్యక్తులైన వారికి సైతం ఈ ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్థిరమైన ఆధారాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒమిక్రాన్‌పై జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు.