గత నెల దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఇప్పటికే పలు దేశాలకు ఈ వేరియంట్ వ్యాప్తి చెందింది. అయితే ఇటీవల భారత్‌లోకి కూడా ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించింది. భారత్‌లోని పలు రాష్ట్రాలకు వ్యాప్తి చెందిన ఒమిక్రాన్ వేరియంట్ దాని ప్రభావాన్ని చూపుతోంది. 20 రోజుల వ్యవధిలోనే దాదాపు 100కు పైగా ఒమిక్రాన్ కేసులు దేశ వ్యాప్తంగా నమోదయ్యాయి.
అయితే దేశ రాజధాని ఢిల్లీలో సైతం ఒమిక్రాన్ కేసుల సంఖ్యం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. తాజాగా మరో రెండు ఒమిక్రాన్ కేసులు ఢిల్లీలో నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ రెండు కేసులతో కలిపి ప్రస్తుతం ఢిల్లీలో 24 ఒమిక్రాన్ కేసులు నమోదవగా.. 12 మంది చికిత్స పొంది ఒమిక్రాన్ నుంచి బయట పడినట్లు తెలుస్తోంది.