ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మండలాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లాల్లో టీఆర్‌ఎస్ నేతలు పెద్ద ఎత్తున్న ర్యాలీ నిర్వహిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. అయితే నియోజకవర్గ కేంద్రాల్లో ఆయా ఎమ్మెల్యేలు పాల్గొనాలని కేసీఆర్ సూచించడంతో గజ్వేల్ ఇందిరాపార్క్ వద్ద ధర్నాలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆందోళ చేస్తే కార్లు ఎక్కించి చంపిన చరిత్ర బీజేపీది అని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని, కార్పొరేట్ సంస్థలకు కొమ్మకాస్తుందని ఆయన విమర్శించారు. బీజేపీపై పోరాటానికి ఇది ప్రారంభం మాత్రమేనని ఆయన అన్నారు. బీజేపీ దిగిపోతనే రైతులు బాగుపడుతారని హరీష్‌రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాతే గ్యాస్, ఎరువుల ధరలు పెరిగిపోయాయన్నారు.