జగనన్న గృహ సంకల్ప పథకాన్ని తణుకులో సీఎం జగన్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10 వేల కోట్లు రుణమాఫీ వన్ టైం సెటిలేమెంట్ లబ్దిదారులకు అందిస్తున్నామని తెలిపారు. 6 వేల కోట్లు రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ మినహాయింపు లభిస్తుందని, లబ్దిదారుల ఆస్తి 22A లో నిషేధిత ఆస్తిగా ఉండేదని, ఇక నుండి నిషేధిత జాబితా నుండి తొలగిస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఓటీఎస్ ద్వారా లబ్ది పొందిన వారికి లింక్ డాక్యుమెంట్ కూడా అవసరం లేదని, ఓటీఎస్ ద్వారా క్లియర్ టైటిల్ ఇస్తున్నామన్నారు. 2014 నుండి 2019 అధికారం లో ఉండగా చంద్రబాబు మంచి చేయలేదని, రుణం మాట కాదు అసలు వడ్డీ మాఫీ కె దిక్కు లేదని ఆయన ఎద్దేవా చేశారు. కనీసం వడ్డీ మాఫీ చేయండి అని ఫైల్ చంద్రబాబుకి అధికారులు పంపిస్తే వెనక్కి పంపారని, 2014-2019లో 43 మంది డబ్బులు చెల్లించిన కూడా ఎలాంటి హక్కు ఇవ్వలేదని జగన్ పేర్కొన్నారు.
మంచి చేస్తే జీర్ణించుకోలేని శక్తులు కొన్ని ఉన్నాయని ఆయన అన్నారు. పేదవాడికి మంచి జరిగితే చూడలేకపోతున్నారని, జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులను కొన్ని ప్రశ్నలు వేయండని ఆయన అన్నారు. మంచి చేస్తే ఎందుకు కడుపు మంట అని చంద్రబాబు ని అడగండి.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకుండా మార్కెట్ రేటుకు మీరు కొంటారా అని గట్టిగా అడగండి.. అంటూ జగన్ వ్యాఖ్యానించారు.