ఒమిక్రాన్‌పై కేంద్రం ఆలోచన ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేస్తోంది కరోనా మహమ్మారి. కొత్త వేరియంట్‌లు బయట పడుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొన్నటి వరకు డెల్టా వేరియంట్‌తోనే ప్రపంచ దేశాలు తలమునకలయ్యాయి. కొన్ని దేశాల్లో డెల్టా వేరియంట్ తగ్గుముఖం పట్టినా మరికొన్ని దేశాల్లోనైతే డెల్టా ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో తాజాగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెందింది. కరోనా ఎఫెక్ట్‌తో పలు దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. అందుకే సంపూర్ణ లాక్‌డౌన్ కూడా విధించలేక పాక్షిక లాక్‌డౌన్, కోవిడ్ నిబంధనలకే పరిమితమయ్యాయి.
భారత్‌లో కూడా ఆర్థికంగా ప్రభుత్వాలపై భారం పడటం, డెల్టా వేరియంట్ ప్రభావం తగ్గుతుండటంతో పలు రాష్ట్రాలు సెకండ్ వేవ్‌పై కూడా ఎక్కవుగా ఆంక్షలు విధంచలేదు. అయితే ఇప్పడు వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే 6 రెట్లు వేగంగా వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ బారిన పడిన దేశాల్లో ఒకటైన యూకేలో ఇప్పటికే ఒమిక్రాన్ మరణాలు మొదలయ్యాయి. ఈ రోజు తాజాగా అమెరికాలోని టెక్సాస్‌లో ఒక ఒమిక్రాన్ మరణం సంభవించింది. ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్ పలు రాష్ట్రాల్లో దాని ప్రభావాన్ని చూపుతోంది. భారత్‌లో ఉన్న జనాభా ప్రకారం ఒమిక్రాన్ వ్యాప్తి ఇక్కడ మరింత వేగంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి.
Also Read
- Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
- US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఒమిక్రాన్ ఎదుర్కునేందుకు ఎలాంటి ఆలోచనలు చేస్తోందని కొందరు ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఇటీవల ఒమిక్రాన్‌పై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఒమిక్రాన్‌పై కోవిడ్ టీకాలు సైతం ప్రభావం చూపడం లేదని స్పష్టం చేశారు. దీంతో బూస్టర్ డోస్‌పై కూడా స్పష్టత లేకుండా పోయింది. అయితే ఈ నెల డిసెంబర్ కావడంతో 25వ తేదీన క్రిస్మస్ పండుగతో పాటు న్యూయర్ వేడుకల్లో యువత భారీగా పాల్గొనే అవకాశం ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తికి వేదికగా ఈ న్యూయర్ వేడుకలు ఆతిథ్యమిచ్చేలా కనిపిస్తున్నాయి.
డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో లాక్‌డౌన్ విధిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ వీటిపై అధికారికంగా స్పష్టత లేదు. ఫస్ట్, సెకండ్ లాక్‌డౌన్‌లు విధించినప్పుడే ఆర్థికంగా కుదేలైన భారత్‌లో మరోసారి ఒమిక్రాన్ వ్యాప్తి వేళ లాక్‌డౌన్‌కు ఆస్కారం ఉందా.. లేదా..? అనే సందేహాలు ప్రజలు మదిలో మెదులుతున్నాయి.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!