శీతాకాల పార్లమెంట్ సమావేశాలు గత నెల చివర్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు 18వ రోజుల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే సభ ప్రారంభం కాగానే రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. లిఖింపూర్ ఘటనతో సహా వివిధ అంశాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. విపక్ష సభ్యులు ఇచ్చిన వివిధ నోటీసులు చైర్మన్‌కు ఇవ్వడంతో వాటిని చైర్మన్ తిరస్కరించారు. దీంతో రాజ్యసభలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు.
విపక్ష సభ్యుల ఆందోళనతో రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ మంత్రులు తెలంగాణ ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం హామీ ఇవ్వాలని కోరుతూ మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు కలవనున్నారు. అంతేకాకుండా ధాన్యం కొనుగోళ్లపై లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరనున్నారు.