తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ‘నిరుద్యోగ దీక్ష’ చేపట్టారు. ఈ దీక్షను ముందుగా ఇందిరాపార్క్ వద్ద చేపట్టాలని భావించారు.అయితే కోవిడ్ నిబంధనల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బండి సంజయ్ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంబంధంచి ప్రత్యక్ష ప్రసారాన్న వీక్షించడానికి ఈ క్రింద లింక్‌ను క్లిక్ చేయండి.
ఏపీలో ప్రస్తుతం సినిమా టికెట్ల ధర, సినిమా థియేటర్ల తనిఖీలు హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. సినిమా టికెట్ ధరలు అధికంగా అమ్మినా, సినిమా థియేటర్లకు సంబంధించి ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకపోయినా సీజ్ చేస్తున్నారు. అయితే గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50కిపైగా థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. కొన్ని సినిమా థియేటర్ల యాజమాన్యాలు స్వచ్ఛందంగా సినిమా థియేటర్లను మూసివేశాయి. అయితే…
కాశ్మీర్‌లో పోలీసు, భద్రతా దళాల ఉమ్మడి బృందాలు గత 48 గంటల్లో 6 గురు ఉగ్రవాదులను హతమార్చాయి. అనంత్‌నాగ్‌లోని కలాన్ సిర్గుఫ్వారా గ్రామంలో ఒక ఉగ్రవాది ఉన్నాడని విశ్వసనీయ సమాచారం మేరకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌ను శనివారం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. అయితే సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదిని లొంగిపోవాలని కోరినా వినకుండా విచక్షణారహితంగా పోలీసులు, భద్రతా దళాలపై కాల్పులు తెగబడ్డాడు. దీంతో ఎదురుకాల్పులు చేసి ఆ ఉగ్రవాదిని ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. అయితే…
ఎప్పడూ రద్దీగా ఉండే హైదరాబాద్ నగరంలో మరింత ఆక్సిజన్ లెవెన్స్‌ను పెంచడానికి జీహెచ్‌ఎంసీ మరోసారి ముందుకు వచ్చింది. ఇప్పటికే హైదరాబాద్‌లో పచ్చదనాన్ని పెంచేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్షలకు పైగా మొక్కలు ఏర్పాటు చేస్తూ గ్రీన్ కవర్‌ను పెంచుతోంది. కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ‘తెలంగాణకు హరితహారం’ను ప్రపంచంలోనే అడవుల పెంపకంలో మూడవ అతిపెద్ద ప్రయత్నంగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. అయితే ‘తెలంగాణకు హరితహారం-2022’లో భాగంగా, మరిన్ని మొక్కలు నాటడం ద్వారా నగరాన్ని పచ్చదనంతో నింపాలని జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది.…
సిద్ధిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా స్వామి వారి కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. ప్రభుత్వం తరుపున స్వామి వారికి పట్టువస్త్రాలను ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు సమర్పించారు. ఈ కల్యాణోత్సవ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు కూడా హజరయ్యారు. మల్లన్న స్వామి కల్యాణోత్సవంతో నేటి నుంచి కొమురవెల్లిలో మల్లన్న…
ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. అయితే ఇటీవల ఏపీలో కూడా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6కు చేరుకుంది. ఒమిక్రాన్ వ్యాప్తిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా ఏపీ ప్రభుత్వంలో చలనం లేదంటూ ఆరోపించారు. ప్రజల ప్రాణాలకంటే కక్ష సాధింపు చర్యలకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. వ్యాక్సినేషన్‌లో ఏపీ వెనకబడిందని, ఇతర…
ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇండియాలో కూడా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లతో ప్రజలు, ప్రభుత్వాలు ఆర్థికంగా చాలా నష్టపోయాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ విధిస్తే ఆర్థిక రాష్ట్రాల్లో కురుకుపోయే ప్రమాదం లేకపోలేదు. ఇటు చూస్తే ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ…
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కోరుతూ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ రేడు ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పనపై టీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధి, ఉపాధి అవకాశాల విషయంలో బీజేపీ వైఫల్యాలపై మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. బండి సంజయ్‌ది ఉద్యోగ దీక్ష కాదు.. సిగ్గులేని దీక్ష అంటూ ధ్వజమెత్తారు. బండి సంజయ్ తలపెట్టిన దీక్ష పచ్చి అవకాశవాదమేనని, బీజేపీ ప్రభుత్వం…
కరనా రక్కసి మరోసారి ఒమిక్రాన్ రూపంలో రెక్కలు చాస్తోంది. ఇప్పటికే డెల్టా వేరియంట్‌తోనే ప్రపంచ దేశాలు సతమతమవుతుంటే.. ఇప్పుడు ఒమిక్రాన్ పలు దేశాలకు వ్యాపించి దాని ప్రభావాన్ని చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు సంఖ్య 1,83,240కి చేరుకుంది. ఇప్పటి వరకు 31 మంది ఒమిక్రాన్ సోకి మృతి చెందారు. యూకేలో 1,14,625 ఒమిక్రాన్ కేసులు ఉండగా, డెన్మార్క్‌లో 32,877, కెనడాలో 7,500, యూఎస్‌లో 6,331 చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటికే పలు దేశాలు విదేశాల…
ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆంధ్రవాసులు సంక్రాంతి పండుగకు ఊరు చేరుకుంటారు. ప్రతి సంవత్సరాలాగే ఈ సంవత్సరం కూడా ప్రత్యేక బస్సుల నడపేందుకు ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లాలోని తొమ్మిది డిపోల నుంచి 320 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. జనవరి 9 నుంచి 13వ తేదీ మధ్య వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా…