కార్వీ ఎండీ పార్థసారథి, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ కృష్ణ హరిని నాలుగు రోజులు పాటు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చినట్లు ఈడీ తెలిపింది. ఖాతాదారుల సెక్యూరీటలను అక్రమంగా దారి మళ్లించినట్లు విచారణలో తేలిందని ఈడీ అధికారులు పేర్కొన్నారు. వీరి ఇద్దరిపై పీఎంఎల్ యాక్ట్ 2002 కింద కేసు నమోదు చేశామని, కార్వీ స్టాక్ బ్రోకింగ్ 2873 కోట్లు రూపాయలు మోసాలకు పాల్పడినట్లు గుర్తించామని ఈడీ అధికారులు…
మార్కెట్ చూపిన బలమైన వృద్ధి ఔట్‌లుక్‌ను దృష్టిలో ఉంచుకుని, జాతీయ, నగర ఆధారిత కంపెనీలకు చెందిన అనేక రెసిడెన్షియల్ డెవలపర్‌లకు హైదరాబాద్ విస్తరణ కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ జోరు 2022 మరియు అంతకు మించి కొనసాగుతుందని భావిస్తున్నారు.ప్రెస్టీజ్ గ్రూప్ ఇటీవల హైదరాబాద్‌లో ఒక ప్రధాన నివాస అభివృద్ధిని ప్రారంభించింది. ఇది కోకాపేట్‌లోని అభివృద్ధి చెందుతున్న వాణిజ్య, నివాస కేంద్రంగా ఉంది. ఇది మూడు ఎత్తైన టవర్‌లతో (మూడు మరియు నాలుగు…
కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీ నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు తీవ్రతరం చేస్తూ.. నైట్ కర్ఫ్యూను విధించారు. మరికొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ లాక్‌డౌన్ కూడా విధిస్తున్నారు. అయితే ఏపీలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను విధిస్తున్నట్లు ప్రకటించింది. నేటి నుంచి ఈ నెల 31 వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…
సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో సికింద్రాబాద్ క్లబ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో క్లబ్ మొత్తం మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులుకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించి మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. క్లబ్‌లో అగ్నిప్రమాదం…
తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో నేడు ప్రభల ఉత్సవం ఎంతో వైభవోపేతంగా నిర్వహించనున్నారు. సంక్రాంతి సమయంలో కోనసీమ వీధుల్లో నడయాడుతున్న ఇంద్రధస్సులా తీర్థాలకు వెళ్లే రంగురంగుల ప్రభలు సీమ అందాలను రెట్టింపు చేస్తాయంటే అతిశయోక్తి కాదు. కోనసీమలో జరిగే ప్రభల తీర్థాలకు వందల ఏళ్ల పురాణ చరిత్ర ఉంది. పెద్ద పండగ నాడు మొదలై… ముక్కనుమ, ఆ తరువాత రోజు వరకు కోనసీమ నలుమూలల సుమారు 90 వరకు ప్రభల తీర్థాలు జరుగుతాయి. కనుమ పండుగ రోజున ప్రభల…
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగను తెలుగురాష్ట్రాల్లో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ వచ్చిదంటే చాలు.. ఘుమఘుమలాడే పిండివంటలు, పిల్లల ఆటపాట, గాలిపటాల హుషారుతో ఇళ్లంతా కోలాహలంగా మారిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తెలుగింటి లోగిళ్లు రంగవల్లులతో దర్శనమిస్తున్నాయి. ఉదయాన్నే లేచేసరికి చలిగాలి పలకరింపుతో పులకరించి, పుణ్యస్నానాలచరించి కొత్తబట్టలు వేసుకొని చిన్నాపెద్దా తేడాలేకుండా హుషారుగా…
సినీ ఫక్కిలో బస్సు దోపిడీకి యత్నించారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భైంసా నుంచి నవీపేట్ మీదుగా హైదరాబాద్‌కు భైంసా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున బయలు దేరింది. అయితే నవీపేట్ మండలం అబ్బాపూర్ (ఎం) గ్రామ సమీపంలోకి బస్సు రాగానే నలుగురు దుండగులు రాళ్లతో బస్సుపైకి దాడి చేసి దోపిడీ యత్నించారు. దీంతో ప్రతిఘటించిన ప్రయాణీకులు.. గట్టిగా కేకలు వేయడంతో ఆ నలుగురు దుండగులు…
రైలు పట్టాలు తప్పి 7గురు మృతి చెందిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గౌహతి-బికనీర్ ఎక్స్‌ప్రెస్ జల్పైగురి జిల్లాలోని దోహోమోని ప్రాంతంలో పట్టాలు అదుపు తప్పింది. దీంతో రైలులోని 12 బోగీలు ఒకదానివెంట మరొకటి బోల్తా కొట్టాయి. ఈ ఘటన నిన్న సాయంత్రం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో 7గురు మృతి చెందినట్లు, మరో 50 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటికే ఈ ఘటనపై ఇండియన్ రైల్వే,…
తెలువారందరి ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడో ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వెళ్లిన వారందరూ ఇంటికి చేరుకొని బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అయితే భోగి, మకర సంక్రాంతి, కనుమగా ఇలా మూడు రోజులు పండుగను అత్యంత వైభవోపేతంగా తెలుగువారందరూ జరుపుకుంటారు. అయితే నేడు భోగి పండుగను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో వేకువజామునే భోగి మంటలు వేశారు. దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పండుగ శోభను సంతరించుకుంది. వీధుల్లో రంగవల్లులు, గంగిరెద్దుల…
ఇటీవల దక్షినాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్ వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. అయితే ఈ ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోకి కూడా ప్రవేశించింది. దీంతో ఒమిక్రాన్ కేసులు పలు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కి చేరింది. అయితే మహారాష్ట్రలో ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య అత్యధికంగా 1,367కు చేరుకుంది. రాజస్థాన్‌లో 792, ఢిల్లీలో 549, కేరళలో 486, కర్ణాటకలో 479, బెంగాల్లో 294, ఉత్తర్‌ప్రదేశ్‌లో…