సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడో ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వెళ్లిన వారు తిరిగి తమ సొంతూరు చేరుకుంటారు. సంక్రాంతి పండుగ రోజున బంధుమిత్రులతో ఎంతో ఆనందంగా గడుపుతుంటారు. ఈ నేపథ్యంలో సొంతూరు వెళ్లావారితో హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీసీ బస్టాండ్‌లు కిక్కిరిసిపోయాయి. ఎక్కడా చూసిన ప్రయాణికుల రద్దీగా బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు కనిపిస్తున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ బస్టాండ్‌లలో ప్రయాణికుల రద్దీ భారీ ఉంది. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులతో పాటు సొంత వాహనాల్లో జనాలు సొంతూళ్లకు…
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వైకుంట ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి భారీ భక్తులు విచ్చేశారు. రాజకీయ, సీని ప్రముఖులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 1.45 గంటలకే స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. అయితే 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వారా దర్శనం కొనసాగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇటు తెలంగాణలో సైతం ఆలయాల్లో భక్తుల రద్దీ భారీగా ఉంది. వేకువజామునుంచే స్వామి…
టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి వీసీ సజ్జనార్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. టీఎస్‌ఆర్టీసీలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తున్న ప్రయాణికుల సమస్యలు క్షణాల్లోనే తీర్చతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా ఓ యువతి అర్థరాత్రి టీఎస్‌ఆర్టీసీ, ఎండీ సజ్జనార్‌ను ట్యాగ్ చేస్తూ ట్విట్ చేసింది. దీంతో సజ్జనార్ వెంటనే స్పందించారు. అయితే అర్ధరాత్రి సమయాలలో ఆర్టీసీ బస్సులలో మహిళల సౌకర్యం కోసం (వాష్ రూమ్స్) బస్సులను పెట్రోల్ పంప్‌లలో 10 నిమిషాలు…
పండుగలకు విందుభోజనం చేయడం మాములే.. అయితే విందుభోజనం కోసం మేక మాంసమో లేక చికెన్‌ను కొనుగోలు చేయాలి.. కానీ ఓ ఇద్దరు వ్యక్తులు మేకలు దొంగతనం చేసి సంక్రాంతి విందుభోజనం చేద్దామనుకున్నారు. కానీ చివరికి మేకలు ట్విస్ట్ ఇవ్వడంతో జైలు పాలయ్యాడు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మేకల గుంపులోని మేకను దొంగతనం చేసేందుకు ఇద్దరు రాత్రి వెళ్లారు. మేక గుంపులోకి వెళ్లారు తీరా మేకను దొంగతనం చేద్దామనుకొని మేకను పట్టుకునే…
భారత్‌లోకి ప్రవేశించేందుకు పాకిస్తానీలు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రాదేశిక జలాల్లోకి పాకిస్తాన్‌కు చెందిన ఓ బోట్ ప్రవేశించడంతో స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్‌కు చెందిన బోట్‌లో ఉన్న 10 మందిని గుజరాత్ తీరరక్షక దళం అదుపులోకి తీసుకుంది. అయితే పట్టుబడ్డిని వారిని విచారణ నిమిత్తం పోర్ బందర్‌కు గుజరాత్ తీరరక్షక దళం తరలించింది. గుజరాత్‌లో గత నెల 20న కూడా భారత ప్రాదేశిక జలాల్లోకి వచ్చిన పాకిస్తాన్‌కు చెందిన ఓ బోట్‌ను గుజరాత్…
ప్రశాంతమైన కర్నూలు జిల్లాలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారి పట్ల పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా ఆత్మకూర్ సంఘటన అనంతరం హుటాహుటిన సంబంధిత ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించాల్సిందిగా జిల్లా ఎస్పీని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, మతవిద్వేషాలు రెచ్చగొట్టే…
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కినట్లు కనిపిస్తున్నాయి. ఇటీవల కరీంనగర్‌లో బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడంతో జాతీయ స్థాయి నేతలు తెలంగాణకు తరలివచ్చారు. అంతేకాకుండా నేడు బండి సంజయ్‌కి ఏకంగా ప్రధాని మోడీ ఫోన్ చేసి దాడి, అరెస్ట్‌లపై ఆరా తీశారు. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతోందనే భావన కూడా తెలంగాణ ప్రజల్లో బలపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం…
పంజాబ్ రాష్ట్రానికి కొత్త డీజీపీగా వీరేశ్ కుమార్ భవ్రా నియమితులయ్యారు. ప్రధాని మోడీ ఇటీవల పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ పర్యటనకు వచ్చారు. అయితే ఈ మోడీ రోడ్డు మార్గంలో వస్తున్నారని తెలుసుకున్న రైతులు ప్రధాని మోడీ కాన్వాయ్‌కు అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు. సుమారు 20 నిమిషాల పాటు మోడీ కాన్వాయ్ రోడ్డుపైనే నిలిచిపోయింది. చివరికి చేసేదేంలేక మోడీ తిరిగుప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో భద్రత లోపాలు తలెత్తడంతో పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ డీజీపీని మార్చివేశారు. దినకర్ గుప్తా,…
2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా క్యాడర్ ఉద్యోగుల పోస్టింగ్స్ పూర్తి చేసినట్లు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. 22 వేల 418 మంది టీచర్లకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తే 21 వేల 800 మంది తమ కొత్త పోస్టుల్లో రిపోర్ట్ చేశారు.. మిగిలిన వారు కూడా ఈ రోజు రిపోర్ట్ చేస్తారని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా 13 వేల 760 మంది జిల్లా క్యాడర్ ఉద్యోగులు కొత్త పోస్టుల్లో జాయిన్ అయ్యారని ఆయన పేర్కొన్నారు.…
కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కుప్పం నుంచే పోటీ చేస్తానని, గెలిచి సీఎంను అవుతానని ధీమా వ్యక్తం చేశారు. దీనికి కౌంటర్‌గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. మేము బెదిరిపోయే పరిస్థితి లేదు, చంద్రబాబుకి కాలం మూడింది అని ఆయన అన్నారు. చంద్రబాబు కుప్పంలోనే పోటీ చేస్తాను అనడాన్ని ఆహ్వానిస్తున్నామని, చంద్రబాబు పోటీ చేస్తాడు, కుప్పంలో ఓడిపోతాడు. పారిపోకూడదని మేము ఆశిస్తున్నాం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీ ఓటమి కుప్పంలో…