ఉద్యోగుల సాధారణ బదిలీలకు ఆంధ్రప్రదేశ్ సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆమేరకు విధించిన బ్యాన్‌ను ఎత్తేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 8 నుంచి 17వరకు బదిలీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఐదేళ్లకు పైబడిన ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పిస్తున్నారు. వ్యక్తిగత వినతులు, పరిపాలన సౌలభ్యం ఆధారంగా బదిలీలను చేపడుతున్నారు. బదిలీల గైడ్ లైన్స్ జారీ చేస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. ఐదేళ్లు ఒకే చోట పని చేస్తే కచ్చితంగా స్థాన చలనం కల్పించాలని స్పష్టం చేసింది.…
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఉద్యోగుల బదిలీ ఫైలుపై ఆయన సంతకం చేశారు. ఈ క్రమంలో బదిలీల్లో ఉద్యోగుల అర్హత, ఖాళీల వివరాలు, ఇతర నిబంధనలతో రేపు లేదా ఎల్లుండి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. CM Jagan: రేపు గుంటూరు, పల్నాడు జిల్లాలలో సీఎం జగన్ టూర్ షెడ్యూల్ ఉద్యోగుల…
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నతాధికారుల బదిలీలపై ఆరోపణలు వస్తున్నాయి. ప్రక్షాళన పేరుతో అనర్హులను అందలం ఎక్కించారని మండిపడుతున్నారు వైద్యాధికారులు. ఏళ్లుగా పని చేయకుండా ఉన్న సీనియర్లను తప్పించేందుకు ఆకస్మిక బదిలీలు చేపట్టారనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో ముగ్గురు జిల్లా వైద్యాధికారులను బదిలీ చేసింది. మేడ్చల్ జిల్లా DMHO డాక్టర్ మల్లికార్జున్‌ను యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో డిప్యూటీ సివిల్ సర్జన్‌గా పనిజేస్తున్న డాక్టర్ పుట్ల శ్రీనివాసుకు DMHOగా పోస్టింగ్ ఇచ్చారు. యాదాద్రి…
పోలీస్ శాఖలో ఏపీ ప్రభుత్వం కీలక బదిలీలను చేపట్టింది. ఇప్పటికే ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్‌ను తప్పించిన ప్రభుత్వం… తాజాగా కడప జైలు ఇంఛార్జి సూపరింటెండెంట్ వరుణారెడ్డిని కూడా బదిలీ చేసింది. వరుణారెడ్డి ఒంగోలు జైలర్‌గా బదిలీ అయ్యారు. ఒంగోలు జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న ప్రకాష్‌ను కడప జైలర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇటీవల వరుణారెడ్డి అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. గతంలో పరిటాల హత్య కేసు నిందితుడు మొద్దు…
ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు త్వరలోనే భారీ ఎత్తున పదోన్నతులు లభించనున్నాయి. ఇందుకు సంబంధించిన నోట్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నోట్‌ను అన్ని జిల్లా, డివిజన్, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పంపించింది. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేయడం వల్ల వచ్చే జూన్‌లోగా 30వేల మంది SGTలకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ రానుంది. Read Also: రూ.10 నాణేల చెల్లుబాటుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అటు రాష్ట్రంలో కొత్తగా…
రాష్ట్ర వరుసగా ఐపీఎస్, ఐఏఎస్, అదనపు కలెక్టర్ హోదా, నాన్ కేడర్ అధికారులను బదిలీ చేయడం, వేయిటింగ్ లో ఉన్న వారికి పోస్టింగులను ఇస్తుంది. శుక్రవారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు అదనపు కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. జగిత్యాల అదనపు కలెక్టర్‌గా బీఎస్ లత, నారాయణ్‌పేట్ అదనపు కలెక్టర్‌గా జి.పద్మజారాణి, రాజన్న సిరిసిల్లా అదనపు కలెక్టర్‌గా ఖీమానాయక్‌కు పోస్టింగ్‌లను రాష్ట్రప్రభుత్వం ఇచ్చింది. అలాగే వరంగల్ అదనపు కలెక్టర్‌గా కె…
తెలంగాణలో కేసీఆర్ పాలనపై మండిపడ్డారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఖాళీగా వున్ర పోస్టు లను భర్తీ చేయకుండా బదిలీల చేయడమేమిటని అన్నారు. మూడున్నర లక్షల ఉద్యోగ వ్యవస్థ ను అగమ్యగోచరంగా తయారు చేశారు. స్థానికత ను ప్రధానంగా తీసుకోకుండా బదిలీలు చేశారన్నారు. స్థానికత కోసమే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగిన విషయాన్ని ప్రభుత్వం మర్చిపోయింది. ఉద్యోగం చేస్తున్న భార్య కేసులను కూడా పట్టించుకోక పోవడం దారుణం. అనారోగ్యం ఉన్న వారిని పట్టించుకోకుండా బదిలీలు చేశారు.…
కీలక సమయంలో ఉపాధ్యాయ సంఘాలను ప్రభుత్వం లైట్ తీసుకుందా? ప్రభుత్వంలోని పెద్దలను కలిసి మాట్లాడుతున్నా.. మార్పు లేదు? ఒకప్పుడు బదిలీలు.. పదోన్నతులు అంటే క్షణం తీరిక లేకుండా గడిపిన టీచర్ల సంఘాల నేతలు.. మౌనంగా ఎందుకున్నారు? ప్రత్యేక రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాలు నిర్వీర్యం..! తెలంగాణలో 50కి పైగా ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. విద్యాశాఖలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ ప్రభావం స్పష్టంగా కనిపించేది. ఏదైనా జరుగుతుంది అంటే అందులో తమ ప్రమేయం ఉన్నట్టుగా హడావిడి చేసి ప్రకటనలు…
తెలంగాణ పురపాలక శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. శంకరయ్య కమిషనర్ నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ కు వెళ్లగా… సి హెచ్ నాగేశ్వర్ కమిషనర్ మీర్పేట్ మునిసిపల్ కార్పొరేషన్.. రామకృష్ణ రావు కమిషనర్ ఫిర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్… రవిందర్ సాగర్ కమిషనర్ మిర్యాలగూడ మునిసిపాలిటి… బి సత్యనారాయణరెడ్డి మేడ్చల్ మునిసిపాలిటీ నుండి నిర్మల్ మునిసిపాలిటీ కమిషనర్ గా బదిలీ అయ్యారు. ఇక ఎస్ వి జానకి రామ్ సాగర్ గద్వాల్ మునిసిపాలిటీ కమిషనర్ గా… జయంత్ కుమార్ రెడ్డి…