తెలంగాణ రాష్ట్రంలో ఇటివల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ వస్తుంది. తాజాగా రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో పది మందికి ప్రభుత్వం పోస్టింగులను ఇచ్చింది.
తెలంగాణలో బదిలీ చేసిన స్థానాల్లో అధికారులను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీలు, సీపీలు, కలెక్టర్లను నియమిస్తూ లిస్ట్ పంపింది. అందులో హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్యాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక.. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాశ్, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌గా క్రిస్టినా పేర్లను ప్రకటించింది.
తెలంగాణ పాలనా వ్యవస్థపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. భారీగా పలు శాఖల ఉన్నతాధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా బదిలీ వేటు వేసినట్లు తెలిసింది.
ఉపాధ్యాయుల బదిలీలకు తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపింది. టీచర్ల బదిలీలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం సవరించింది. టీచర్ యూనియన్ల నేతలకు పది అదనపు పాయింట్లను హైకోర్టు తప్పుపట్టింది.