ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి సంబంధించి క్లూస్ టీం విచారణ ముగిసింది. బీబీనగర్‌లో రైల్వే స్టేషన్‌కు వచ్చిన క్లూస్ టీమ్ మంటల్లో కాలిపోయిన బోగీలను తనిఖీ చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే బోగీల నుంచి సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. సైంటిఫిక్ నివేదిక తర్వాతే అసలు వివరాలు చెబుతామని అధికారులు చెప్పారు.
250 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలను బలిగొన్న బాలాసోర్ రైలు దుర్ఘటనకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్టు చేసింది.
సమాజంలో తొందరగా గుర్తింపు పొందేందుకు జనాలు పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నారు. రైలు వస్తుండగా సెల్ఫీలు తీసుకోవడం.. రైలు వెళ్తుండగా ఫుట్ పాత్ నుండి వేలాడం ఇలాంటి వీడియోలు ఇంతకుముందు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాంటి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా త్వరగా గుర్తింపు పొందుతారని ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వీడియోలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
కొన్ని సందర్భాల్లో కొందరికి అదృష్టం కలిసి వస్తే.. మరికొన్ని సార్లు దురదృష్టం వెంటాడుతుంటుంది. ఇక్కడ ఒక మహిళకు మాత్రం అదృష్టం వరించి ఆమె మృత్యుంజయురాలుగా మారింది.
పశ్చిమ బెంగాల్‌లోని రైల్వే స్టేషన్‌లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) సిబ్బంది ఒక ప్రయాణికుడిని రక్షించింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఆర్పీఎఫ్ ఇండియా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై నిలబడిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా ట్రాక్‌పైకి వచ్చి పడుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు గమనించిన కానిస్టేబుల్ కె. సుమతి ఆ వ్యక్తిని రక్షించడానికి పరుగెత్తుకుంటూ వచ్చింది. దాంతో ఆ వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు.
ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాద ఘటనను మరువకముందే మరో ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. సీల్దా-అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ కోచ్‌లలో ఒకదానిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
ఓవైపు ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం, దాని వివరాల్ని తెలుసుకుంటూ బాధపడతూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో.. మరో రైలు ప్రమాదం జరగబోయి.. అంతలో ఆగింది. అది కూడా జరిగివుంటే.. మరో దుర్వార్త అయ్యేది.