Train in Siddipet: సిద్దిపేట జిల్లా వాసులు సొంత భూమి నుంచి రైలు ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల.. నెరవేరేందుకు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. రైలు అనే మాట వినని ఈ ప్రాంత ప్రజలు.. అది సాకారమైన తరుణంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని నవ్వు తెప్పించేలా ఉంటే కొన్ని ఆలోచింపజేశాలా మరికొన్ని కోపం తెప్పించేలా ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ ముగ్గురు యువకులు ట్రైన్ తో సాహసం చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను రాజస్థాన్‌లోని గోరం ఘాట్ లో తీశారు. రాజస్థాన్‌లోని ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో ఒకటి. దీనిని రాజస్థాన్ కశ్మీర్ అని కూడా పిలుస్తారు.…
గుజరాత్‌లోని తిరుచిరాపల్లి-శ్రీ గంగానగర్ మధ్య నడిచే హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. రైలు నుంచి పొగలు కమ్ముకున్నట్లు కనిపిస్తున్నాయి. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడం ఊపిరి పీల్చుకున్నారు.
రైలు ఢీకొని రెండు మొసళ్లు చనిపోయిన ఘటన బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌లో జరిగింది. బగాహా-వాల్మీకినగర్ రోడ్ రైల్వే స్టేషన్ మధ్య మంగళ్‌పూర్ ఔసాని హాల్ట్ సమీపంలో మొసళ్లను రైలు ఢీకొనడం కనిపెట్టారు. దీంతో వెంటనే రైల్వే సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు.
Uttar Pradesh: ట్రైన్ లో ఓ బోగీలో ఉన్నవారికి చుక్కలు చూపించారు పాములు ఆడించేవారు. తమకు కావల్సినంత డబ్బులు ఇవ్వలేదని వారిపైకి పాములను వదిలారు. భోగిలోని వారందరిని బిక్కు బిక్కుమంటూ బతికేలా చేశారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హౌరా, గ్వాలియర్‌ల నడుమ ప్రయాణిస్తుంది చంబల్ ఎక్స్ ప్రెస్. శనివారం సాయంత్రం బందా స్టేషన్ లో అందరితో పాటే ఓ నలుగురు పాములు పట్టుకునే వారు రైలు ఎక్కారు. వారు కొంచెం…
Train Moved without Engine: రైలు కదలాలంటే కచ్ఛితంగా ఇంజిన్ కావాల్సిందే. డ్రైవర్ ఉండాల్సిందే. అయితే ఓ రైలు మాత్రం ఇవేవి లేకుండానే దానంతట అదే కదిలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.జార్ఖండ్ సాహిబ్‌గంజ్ జిల్లాలోని మాల్దా రైల్వే డివిజన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. దీనిని చూసిన జనం ఆశ్చర్యపోయి దీనిని తమ ఫోన్ లో బంధించారు. అసలేం జరిగిందండటే బార్హర్వా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక రైల్వే వ్యాగన్, నాలుగు బోగీలు…
సిద్ధిపేట జిల్లా ప్రజలకు రైలు ఎక్కాలనే కల ఎట్టకేలకు తీరబోతోంది. త్వరలోనే సిద్దిపేటకి రైలు జర్నీ ఆరంభం కానున్నాయి. ఈ క్రమంలో నర్సాపూర్ స్టేషన్ వరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ట్రయల్ రన్ నిర్వచించారు. ఇక, సిద్దిపేటలో రైలు కూతపై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ట్రైన్ ముందు నిలబడి సెల్ఫీ దిగి తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారాయన.
తిరుపతి, ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. రైలులోని ఏసీ బోగీలో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగడంతో రైలు ఆగింది.
Dog Struck Under Train: రైల్వే స్టేషన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న పెనుప్రమాదమే జరగొచ్చు. అలాంటి ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలను మనం తరచూ సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఎన్ని సార్లు హెచ్చరిస్తున్నా చాలా మంది వాటిని పెడచెవిన పెడుతున్నారు. రైల్వే గేటు వద్ద దాటుతూ ప్రాణాలు కోల్పొయిన వారు ఎంతో మంది. మనుషులే కాదు ఏనుగులు, గేదెలు, కుక్కలు,…