9 dead in Train Fire near Madurai Railway Station: తమిళనాడులోని మధురైలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం లక్నో నుంచి రామేశ్వరం వెళ్తున్న రైలు టూరిస్ట్ కోచ్‌లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రైలు బోగీ పూర్తిగా కాలిపోగా.. 9 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత…
పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హజారా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.
బాలాసోర్ రైలు ప్రమాదంలో ముగ్గురు నిందితులుగా ఉన్న రైల్వే అధికారులను సీబీఐ రిమాండ్ కాలం ముగిసిన తర్వాత భువనేశ్వర్‌లోని ప్రత్యేక కోర్టు శుక్రవారం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
ఒడిషా రైలు ప్రమాదంలో నిర్లక్ష్యంగా వ్యవహారించిన అధికారులపై రైల్వే శాఖ వేటు వేసింది. తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహారించడం వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని.. వేలాది మంది గాయపడ్డారని పేర్కొంటూ.. ఏడు మందిపై రైల్వే శాఖ వేటు వేసింది.
ఒడిషాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాద ఘటనకు ప్రధాన కారణం రాంగ్ సిగ్నలింగ్ అని ఉన్నత స్థాయి విచారణ కమిటీ స్పష్టం చేసింది. భద్రతా ప్రమాణాలు పాటిస్తే దుర్ఘటన జరిగి ఉండేది కాదని కమిటీ నివేదికలో పేర్కొంది. ఒడిషా ఘోర రైలు ప్రమాదంపై రైల్వే బోర్డుకు సేఫ్టీ కమిషన్ తన నివేదికను సమర్పించింది.
Train Accident: రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌కి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నపాటి అజాగ్రత్త వల్ల మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయని చాలాసార్లు చూసి ఉంటారు.
ఒరిస్సా రైలు ప్రమాదం ఘటన మరిచిపోకముందే.. మరో పెను రైలు ప్రమాదం తృటిలో తప్పింది. లోహిత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన 10 బోగీలు ఇంజన్ నుంచి విడిపోయాయి. అస్సాంలోని గౌహతి నుంచి జమ్మూ తపాయికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇంజిన్ నుంచి సుమారు 10 బోగీలు విడిపోయి పట్టాలపై నిలిచిపోయాయి. దీంతో లోహిత్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు పార్ట్ లుగా విడిపోయింది.
డిశాలోని రాయగడ జిల్లాలోని అంబోదలా యార్డ్‌లోని వేదాంత లిమిటెడ్ ప్లాంట్‌కు శనివారం వెళ్తుండగా గూడ్స్ రైలు నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఒడిశాలోని రాయగడ జిల్లా అంబడోలా సమీపంలో శనివారం గూడ్స్ రైలుకు చెందిన నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పి నట్లు రైల్వే అధికారి తెలిపారు.