తన మిస్ వరల్డ్ ప్రయాణం ప్రారంభానికి ఇండియానే వేదిక అని మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా పేర్కొంది. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడింది. నమస్తే ఇండియా.. హెల్లో వరల్డ్.. అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించింది. తాను గత మిస్ వరల్డ్ పోటీల్లో ముంబాయిలోనే విజేతగా నిలిచినట్లు తెలిపింది. ఇండియా తనకు ఎప్పుడు స్పెషల్ అని చెప్పింది. ఇక్కడ ప్రజల చాలా మంచి అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుందని స్పష్టం చేసింది.
ప్రధాని నరేంద్ర మోడీ గురువారం తన విదేశీ పర్యటనలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక చిత్రాల వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్నారు. ఈ వీడియోను పంచుకుంటూ.. ప్రధాని మోడీ క్యాప్షన్‌లో " భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది!.. నేను ఎక్కడికి వెళ్లినా, నా దేశ చరిత్ర, సంస్కృతి పట్ల నాకు అపారమైన ఉత్సాహం కనిపిస్తుంది. ఈ ఉత్సాహం చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది." అని రాసుకొచ్చారు.
కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వరుస పోస్టులు చేశారు. భారతీయ సంప్రదాయాలను, సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంతగా ద్వేషిస్తోందని ఆయన ప్రశ్నించారు