ఏపీ ప్రభుత్వం ఇసుక విషయంలో గుడ్‌న్యూస్ చెప్పింది.ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను ట్రాక్టర్లల్లో తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో స్థానిక అవసరాలకు ఇసుకను తీసుకెళ్లేందుకు కేవలం ఎడ్ల బండ్లకు మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.
విజయవాడ శివారులో తాగు నీటి సమస్య ఉంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలో ప్రతి గ్రామానికి నీటి ట్యాంకర్ల పంపిణీ చేశామని.. ఇప్పటిదాకా 120 న్యూటి ట్యాంకర్ల ఇచ్చాం.. ఇంకా నీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు ఇస్తాం.. 13 కోట్లు తాగు నీటి సమస్య పరిష్కారానికి ఖర్చు చేస్తున్నాం.. ఏ ఎంపీ చేయనటువంటి కార్యక్రమం చేయడం.. నా అదృష్టంగా భావిస్తున్నాను.. చంద్రబాబు, ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకెళ్తున్నామని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని
రైతు కుటుంబం నుంచి వచ్చిన ఓ వరుడు.. తమ ప్రధానవృత్తి వ్యవసాయం అందుకు తగ్గట్టుగా తన వివాహ ఊరేగింపు ఉండాలనుకున్నాడు. అందుకు ఒకటి రెండు కాదు ఏకంగా 51 ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్లాడు. ఇందులో ఓ ట్రాక్టర్‌ని వరుడే స్వయంగా నడపగా..మిగతావి బంధవులు స్నేహితులు నడిపారు.
గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించారు. రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను సీఎం జగన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రూ. 361.29కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను రైతు గ్రూపులకు సీఎం పంపిణీ చేశారు. 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను కూడా సీఎం జగన్ పంపిణీ చేశారు.
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. డాక్టర్ వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా అందజేసిన ట్రాక్టర్‌లు, హర్వెస్టర్‌లను జెండా ఊపి ప్రారంభించారు జగన్. రైతులకు పంపిణీ చేసే ట్రాక్టర్ ను స్వయంగా నడిపారు సీఎం జగన్. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రైతులకు వ్యవసాయంలో ఖర్చు తగ్గించేందుకు వై.ఎస్.ఆర్. యంత్రసేవా పథకం ప్రారంభిస్తున్నాం అని చెప్పారు. వరి ఎక్కువగా పండించే ప్రాంతాలలో కంబైన్డ్ హార్వెస్టర్ లు అందుబాటులోకి తెస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి రైతు…
ఏపీలోని రైతులకు సీఎం జగన్ శుభవార్త అందించారు. జూన్ నెలలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను బుధవారం నాడు కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో ప్రకటించారు. జూన్ 7న రైతన్నలకు 3,800 ట్రాక్టర్లు సహా 5వేలకు పైగా వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేస్తామని జగన్ వెల్లడించారు. అంతేకాకుండా జూన్ 14న రైతులకు పంటల బీమా పరిహారం చెల్లిస్తామన్నారు. జూన్ 23న అమ్మ ఒడి నిధులను విడుదల చేస్తామని జగన్ తెలిపారు. YSRCP: వచ్చే నెలలో వైసీపీ ప్లీనరీ.. భారీ ఎత్తున…
మావోయిస్టులు మళ్లీ పంజా విసురుతున్నారు.. వరుసగా దాడులకు దిగుతున్నారు.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో దాడులకు పాల్పడుతున్నారు.. ఇన్న బీజాపూర్ జిల్లాలోని కుత్రు పోలీసు స్టేషన్ పరిధిలోని ధర్బా దగ్గర పోలీసు క్యాంపుపై మెరుపుదాడికి పాల్పడ్డ మావోయిస్టులు.. ఇవాళ బర్సూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని మంగనార్ గ్రామంలో పీఎంజీఎస్‌వై రోడ్డు నిర్మాణంలో నిమగ్నమైన ఏడు ట్రాక్టర్లను తగలబెట్టారు. ఈ ఘటనకు మావోయిస్టు ఈస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ చేసింది. స్థానికుల చెబుతున్న వివరాల ప్రకారం.. మహిళలతో సహా…
నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా అఖండ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సినిమా విడుదలయినప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. తన నటనతో మరోసారి బాలకృష్ణ అంటే ఏంటో చూపించారు. కరోనా, ఓటీటీల కారణంగా థియేటర్లకు జనాలు వస్తారో రారో అన్న అనుమానం ప్రొడ్యూసర్లలో ఉండేది. కానీ బాలయ్య ఒక్క సినిమాతో ఆ అనుమానాన్ని పటా పంచలు చేశారు.…
కేంద్రం కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాల్సిందే.. లేకపోతే ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు సంయుక్త కిసాన్ మెర్చా నేత రాకేష్ టికాయత్.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు చేస్తున్న ఆందోళన ఏడాది దాటింది.. ఇక, ఆ వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ.. రైతులకు క్షమాపణలు కూడా చెప్పారు.. అయితే, కనీస మద్దతు ధర చట్టం తెచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతు సంఘాలు చెబుతున్నాయి..…