Viral Video: ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు వెరైటీగా చేసుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లంటే ఫస్ట్.. ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సిందే. వధువరుడు పెళ్లిలో చేసే తతంగాన్ని మొత్తం షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసమని.. డ్యాన్స్ లు కానీ, పాటలు కానీ.. ఇలా స్పెషల్ గా ఏదొకటి చేసి వైరల్ గా మారుతున్నారు. ఇప్పుడు అలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Read Also: NEET 2023 Results: నీట్ ఫలితాలు విడుదల.. టాపర్ మనోడే
రైతు కుటుంబం నుంచి వచ్చిన ఓ వరుడు.. తమ ప్రధానవృత్తి వ్యవసాయం అందుకు తగ్గట్టుగా తన వివాహ ఊరేగింపు ఉండాలనుకున్నాడు. అందుకు ఒకటి రెండు కాదు ఏకంగా 51 ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్లాడు. ఇందులో ఓ ట్రాక్టర్‌ని వరుడే స్వయంగా నడపగా..మిగతావి బంధవులు స్నేహితులు నడిపారు. ఈ ఘటన రాజస్తాన్ బార్మర్‌లో జరిగింది.
Read Also: Pic talk : పింక్ ఫ్రాక్ లో రకుల్ ఘాటు పోజులు..
బార్మర్ లోని గూడమలాని గ్రామానికి చెందిన ప్రకాష్ చౌదరికి రోలికి చెందిన మమతతో వివాహం నిశ్చయమైంది. సదరు వరుడు 51 కి.మీ దూరంలో ఉన్న వధువు ఇంటికి 51 ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్లాడు. ఇలా వినూతన్నంగా ట్రాక్టర్లపై రావడం చూసి వధువు తరుపు వారు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సందర్భంగా వరుడు ప్రకాశ్ క్లారిటీ ఇచ్చాడు.. అయితే నా కుటుంబం ప్రధాన వృత్తి వ్యవసాయం. అందరూ వ్యవసాయమే చేస్తారు. అలాగే ట్రాక్టర్‌ను రైతుకు గుర్తింపుగా భావిస్తామని చెప్పాడు. అందుకు ఇలా ట్రాక్టర్లపై వచ్చినట్లు వరుడు తెలిపారు. మా నాన్న పెళ్లి ఊరేగింపుకి ఒక ట్రాక్టర్ ఉపయోగించారు. నేనెందుకు ట్రాక్టర్లు ఉపయోగించకూడదు అని అనుకుని.. ఇలా 51 ట్రాక్టర్లపై లగ్గానికి వచ్చాడు వరుడు.
#WATCH | Rajasthan: A bridegroom arrived with 51 tractors as part of his wedding procession, from Sewniyala to Borwa village in Barmer district. The 1-km long wedding procession had around 150 guests and was led by the bridegroom who himself was driving a tractor. (08.06.2022) pic.twitter.com/euK16AO9LQ
— ANI (@ANI) June 9, 2022